తెలంగాణ

రాజధానిలో భారీ ‘ఔషధ మొక్కల తోట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా భారీ ఎత్తున ఔషధ మొక్కల తోటను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ సమీపంలోని ఆయుష్ శాఖకు చెందిన 24 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డుకు కేటాయించింది. బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాలకు చెందిన 58 ఎకరాల భూమిలో మెడిసినల్ ప్లాంట్ బోర్డుకు 24 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిలో ఔషధాలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను పెంచేందుకు ఒక ప్రాజెక్టును రూపొందించారు. ‘బయోసిన్‌మెడికా’ అని ఈ ప్రాజెక్టుకు పేరుపెట్టామని మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు వెల్లడించింది. దాదాపు ఐదుకోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించినట్టు మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది.
మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఇప్పటికే హైదరాబాద్‌లోని రాష్టప్రతిభవన్ (బొల్లారం), రాజ్‌భవన్‌లలో ఔషధ మొక్కల పెంపకానికి చేయూత అందించింది. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోకూడా ఔషధ మొక్కల పెంపకానికి చేయూత ఇస్తున్నట్టు మెడిసినల్ ప్లాంట్ బోర్డు డిప్యూటీ సీఈఓ వెంకటేశ్వర్లు బుధవారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
రాజధానిలో చేపట్టబోయే బయోసిన్‌మెడికా ప్రాజెక్టు దేశంలోనే ఆదర్శవంతమైన ఔషధ మొక్కల కేంద్రంగా మారే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.