తెలంగాణ

రాష్ట్రంలో ఐదుచోట్ల కొత్త విమానాశ్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం, నిజామాబాద్ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఈ ఐదు ప్రాంతాలలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మంత్రి ఆదేశించారు. గురువారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన వ్యూహంపై అధికారులతో మంత్రి చర్చించారు. వరంగల్ జిల్లా మామునూర్ వద్ద సుమారు 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీనికి అదనంగా మరింత స్థలాన్ని సేకరించాలని మంత్రి ఆదేశించారు. కొత్త విమానాశ్రయాలలో మిగిలిన వాటికంటే వరంగల్‌లో ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అధికారులు వివరించారు.
ఈ అంశంపై వరంగల్‌లో ఈ నెల 27న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి ఎయిర్‌పోర్ట అథారిటీ అధికారులను కూడా ఆహ్వానించాలని ఆదేశించారు. అలాగే కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించినట్టు స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మంత్రికి వివరించారు. విమానాశ్రయం ఏర్పాటుకు ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరిపామన్నారు. తాజాగా గుర్తించిన స్థలంపై సర్వే నిర్వహించాలని వెంకట్రావ్ కోరారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. తొలి విడతలో ఎంపిక చేసిన ఐదు విమానాశ్రయాల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు ఏయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సంస్థల సహకారం తీసుకొని సర్వే ప్రారంభించాలని టిఎస్‌ఐఐసి అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన విమానయాన వ్యూహాన్ని రూపొందించాలని రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాలకు పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేయాలని సూచించారు.