తెలంగాణ

రేపటి నుంచి సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: తమ డిమాండ్‌ల సాధన కోసం సమ్మె బాట తప్పడంలేదని, ఈనెల 21 నుంచి నిరవధికంగా సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సంఘం వెల్లడించింది. ఈ మేరకు కాంట్రాక్టు కార్మికుల జెఎసి నేతలు సమ్మెపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కార్మిక నేతలు సమ్మెబాటకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కార్మికశాఖ చర్చలకు రండి అంటూ కార్మిక నేతలకు సమాచారం పంపింది. ఇటు చర్చలు అటు సమ్మెపై చర్చలతో మింట్‌కాంపౌండ్ వద్దకు కార్మిక నేతల రాకతో హడావిడి నెలకొంది. సమ్మెబాటపై కార్మిక నేతలు మూకుమ్మడిగా ముందుకు సాగుతున్నప్పటికీ నిరసన కార్యక్రమాలపై ఎవరిదారిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు మానవహారం చేయాలని కొంతమంది సూచించగా కొంతమంది కార్మిక శాఖ కమిషనర్‌తో చర్చలు జరపడానికి సిద్ధం అవుతున్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని అయితే ఆచరణలో అమలు కాకపోడంతో తాము సమ్మెబాటకు వెళ్ళాల్సి వచ్చిందని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కొత్త డిమాండ్‌లు చేయడంలేదని కార్మిక నేతలు చెబుతున్నారు. సిఎం హామీల అమలుకు తాము ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 2018 పిఆర్‌సిలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
గ్రేడ్ 3,-4లను గ్రేడ్ 2లో అమలుకు నోచుకోవడం లేదన్నారు.విధి నిర్వహణలో కార్మికులు మృతి చెందితే రూ 10 లక్షలు పరిహారం చెల్లించాలని వారు కోరారు.
కార్మికులకు పిఎఫ్ ఇఎస్‌ఐ వంటి పథకాలు అమలు చేయాలన్నారు. తాము సూచించిన 7,11 డిమాండ్‌లలో సగం అమలు చేయడానికి యాజమాన్యం సూచిస్తోందని, అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. తమను భయపెట్టడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని వాటిని తాము ఖాతర్ చేయమని వారు హెచ్చరించారు. ఈనెల 20వ తేదీన చర్చలకు రావాలని కార్మికశాఖ నుంచి సమాచారం వచ్చిందన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు చర్చలు జరుగుతాయని వారన్నారు. చర్చలు విఫలం అయితే మాత్రం తాము సమ్మెకు సిద్ధమని వారు స్పష్టం చేశారు. గురువారం పలుమార్లు యూనియన్ నేతలు చర్చల్లో పాల్గొన్నారు. జెఎసి చైర్మన్ ఈశ్వర్‌రావు, కన్వీనర్ నాగరాజు, తెలంగాణ కాంట్రాక్టు కార్మిక నేతలు శివశంకర్, సాయిలు పాల్గొన్నారు.
ఈనెల 20వ తేదీ నుంచి 6 నెలలు పాటు విద్యుత్‌శాఖలో సమ్మె నిషేధం అమలు చేయనున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు సమ్మె నిషేధం మరొకవైపు సమ్మెబాటకు కార్మికులు పిలుపు ఇవ్వడంతో ఏమి జరుగుతుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.