తెలంగాణ

అటవీ అధికారులకు ఆయుధాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి త్వరలో ఆయుధాలు సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ శాఖ అధికారుల వద్ద ఆయుధాలు ఉన్నటికీ మావోయిస్టులు తరచూ ఎత్తుకెళ్లడం, బెదిరింపుల కారణంగా వాటిని పోలీస్‌శాఖకు అప్పగించారు. దీంతో చిన్నపాటి సమస్య ఎదురైనా పోలీస్‌శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా వేటగాళ్లు, స్మగ్లర్లు రెచ్చిపోయారు. దీంతో అటవీ సంపద నానాటికీ తగ్గిపోతున్నది. వేటగాళ్లు, స్మగ్లర్లను నివారించే క్రమంలో ఎంతో మంది అటవీ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఇక ఆక్రమణల గురించి చెప్పనక్కర్లేదు, పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు, ఉద్దేశపూర్వకంగా కొందరు అటవీ భూములను ఆక్రమించుకోసాగరు. దట్టమైన అడవిలో ఆక్రమణల ప్రాంతాలను గుర్తించడమే సమస్య కాగా, గుర్తించిన అనంతరం వాటిని తిరిగి స్వాధీనంలోకి తీసుకోవడం పెనుసవాలుగా మారుతోంది. ఆక్రమణల గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడులు నిత్యకృత్యం. వేటగాళ్లు, విలువైన అటవీ సంపదను తరలించుకుపోయే స్మగ్లర్లు నుంచి ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది. శాఖల మధ్య సమన్వయ లోపం కూడా వారికి కలిసి వచ్చింది. అటవీ అధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. వీటన్నింటిని నిలువరించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది వద్ద ఆయుధాలు ఉండటం తప్పని సరి అని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.