తెలంగాణ

ఒక్క రూపారుూ అనర్హులకు వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ప్రభుత్వం పేదల కోసం ఖర్చు చేస్తున్న ఒక్క రూపాయి కూడా అనర్హులకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక శాఖ సలహాదారుడు జీఆర్ రెడ్డి, ముఖ్య కారదర్శి రామకృష్ణారావులతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని, అందుకు వేలాది కోట్లను ఖర్చు చేస్తోందని ఈటల అన్నారు. భారీ నిధులతో అమలు అవుతున్న పథకాలను అనర్హులు వినియోగించుకుంటే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని అన్నారు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ అవినీతిని ఎందుకు అరికట్టలేక పోతున్నామని అధికారులను ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో ఆడిట్ చేసి తప్పు జరిగిందని తేల్చి రికవరీ చేయడంలో అలసత్వం ఎందుకని ఆయన నిలదీశారు. దీనికి అధికారులు తప్పు తేల్చిన రికవరీ చేసే అధికారం తమకు లేదని చెప్పడంతో వెంటనే నిబంధనలు మార్చాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షపడేలా చూడాలని, ఎవరు తప్పచేసినా తప్పించుకోలేరన్న భావన తీసుకురావాలన్నారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ఆదేశించారు. అక్రమాలకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పింఛన్ల విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. పింఛను కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అదే సందర్భంలో 50 ఏళ్లుగా నామినీలు పింఛన్లు పొందడంపై దృష్టి సారించాలని, ఇందుకు సహకరిస్తున్న జీఓ 315ను పునఃసమీక్షించాలని కోరారు. ప్రజలతో నేరుగా సంబంధాలు లేకున్నా ప్రణాళిక శాఖ రాష్ట్ర అభివృద్థికి ఎంతో కీలకమని పేర్కొంటూ, పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించి తమ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు పూర్తి చేశామన్న దానిపై బేరీజు వేసుకొని ముందుకు సాగాలని సూచించారు.