తెలంగాణ

నష్టాలను అధిగమిస్తూనే ప్రయాణీకులకు సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను నష్టాల నుంచి అధిగమిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని సంస్ధ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రైవేటు వాహనాల పోటీని తట్టుకుంటూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. రవాణా వ్యవస్థలో పోటీ నెలకొన్నదని, ఆటోలు, మ్యాక్స్, తుఫాన్, సెవెన్ సీటర్ల వంటి ప్రైవేటు వాహనాల పోటీని తట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రోజు వారీగా సంస్ధకు రాబడి రూ.11 కోట్లు కాగా, ఖర్చు రూ.14 కోట్లు అవుతున్నా సంస్థ సిబ్బందికి వర్తించే ప్రయోజనాల విషయాల విషయంలో కొంత అటు-ఇటుగా అందజేస్తున్నామని ఆయన వివరించారు. దేశంలోనే మన రాష్ట్ర ఆర్టీసీకి మంచి పేరు ఉన్నదని ఆయన తెలిపారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం కాకుండా ఉంటే తనను సంప్రదించవచ్చని చైర్మన్ సోమారపు సత్యనారాయణ చెప్పారు.