తెలంగాణ

సింగరేణిలో భారీ సమాచార వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్న సింగరేణి సంస్థ నూతన సమాచార వ్యవస్థను అందిపుచ్చుకోవడానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి గనుల్లో చేపడుతున్న పనుల ప్రగతిపై మల్టీ డిపార్టుమెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమాలను స్థానిక ఏరియా జనరల్ మేనేజర్లు పర్యవేక్షణలో సదస్సులు ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి కంపెనీ గురించి వివరించడం, కార్మికులతో తరచు యాజమాన్యం సమాలోచనలు, సదస్సులతో ఇరువురి మధ్య సఖ్యత ఏర్పడుతుందని సంస్థ అభిప్రాపడుతోంది. నూతనంగా ఏర్పాటు చేస్తున్న సమాచార వ్యవస్థను ఈనెల 23వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. సింగరేణిలో 19 ఓపెన్ కాస్ట్ గనులు, 29 భూగర్భ గనులు, అన్ని వర్కుషాపులు, సివిల్‌స్టోర్సు. సీసిహెచ్‌పీలలో ఉన్న 54వేల మంది కార్మికులతో సదస్సులు నిర్వహించబోతున్నారు.
ముఖ్యంగా సింగరేణి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలతో పాటు సకాలంలో గనుల్లో ఉత్పత్తి లక్ష్యాలు సాధిచలేకపోడానికి కారణాలతో పాటు వాటిని ఎలా అధికమించాలి? భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో యంత్రాలు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాయి? ఏమేరకు పని గంటలు పెంచాలి? ఎంత వరకు పెంచితే ఎంత లాభాలు ఉంటాయి? అనే అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. సమాచార వ్యవస్థ ద్వారా కార్మికులతో పరస్పర సమాచారం ప్రక్రియను రూపొందించనున్నారు. ఎప్పటికప్పుడు కార్మికుల అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుందని సంస్థ వ్యక్తం చేస్తోంది. గనుల్లో పాత యంత్రాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడంతో పని భారం తగ్గుతుందని చెబుతున్నారు. కార్మికులకు అధునాతన వైద్యం అందించడంతో పాటు రక్షణపై కార్మికుల సూచనలు అమలు చేయనున్నారు. ప్రతి ఏరియాలో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరాలు స్థానిక బోర్డులో ఉంచడం జరుగుతుంది. సింగరేణిలో యావత్ కార్మికులకు సమాచారం అందివ్వడానికి సీఎండీ ఆధ్వర్యంలో ఆరు రకాల పోస్టర్లను ఆవిష్కరించారు. సింగరేణి పరిధిలో వరంగల్, ఖమ్మం,కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో గనులు విస్తరించాయి.