తెలంగాణ

కాంట్రాక్టు లెక్చరర్ల మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీలు చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వం మాట నిలుపుకోవాలని కోరుతూ వందలాది మంది ఇంటర్ విద్య కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. దీనితో బోర్డు కార్యాలయం, కమిషనర్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు నెలల కాలంలో ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు ఆత్మహత్య చేసుకోవడంతో కాంట్రాక్టు లెక్చరర్ల యూనియన్ బాధ్యులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఖాళీ ఉన్న చోట కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను కొనసాగిస్తున్న ప్రభుత్వంపై ఇపుడు వారి బదిలీల వ్యవహారం కూడా ఇబ్బందిగా తయారైంది. ఊళ్లకు చాలా దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నామని, తక్షణమే తమ కుటుంబాలకు దగ్గరగా ఉన్న కాలేజీలకు బదిలీ చేయమని వారు కోరుతున్నారు. చాలా కాలేజీల్లో పోస్టులు ఖాళీగా ఉంచుతున్నారే తప్ప తమను నియమించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోలేదని కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగ భద్రత, జీతాలు, బదిలీలపై తీవ్రమైన మానసిక ఆందోళన చెందుతున్నారని సంఘం నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా లెక్చరర్లు రోజూ కన్నీరు మున్నీరవుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకునేలా నాయకులు ఒత్తిడి తేవడం లేదని వారు ఆరోపిస్తున్నారని, కానీ తాము ఎన్ని రకాలుగా నచ్చచెప్పినా అధికారుల మనసు కరగడం లేదని కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు జె కురుమూర్తి, ప్రచార కార్యదర్శి సయ్యద్ జమీఉల్లా పేర్కొన్నారు. శుక్రవారం నాడు కమిషనరేట్‌కు కాంట్రాక్టు లెక్చరర్లు అంతా రావాలని వారు పిలుపునివ్వడంతో వందలాది మంచి వచ్చారు. ఒక పక్క జీతాలు అందక, మరో పక్క క్రమబద్ధీకరణ జరగక, ఇంకో పక్క సకాలంలో బదిలీలు కాక కాంట్రాక్టు లెక్చరర్లు నానా అగచాట్లు పడుతున్నారని వారు చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనతో నాంపల్లి కమిషనరేట్ వద్ద వందలాది పోలీసులను మోహరింపచేశారు. సమస్య పరిష్కారానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని , వారి విషయంలో ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తోందని బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు.