తెలంగాణ

టీచర్ల కొరతపై గవర్నర్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని పాఠశాలల్లో టీచర్ల కొరతపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పందించారు. ముఖ్యంగా రాజ్‌భవన్ పాఠశాలలోనూ టీచర్ల కొరతపై ఆయన ఆరా తీయడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ నెలాఖరులోగా స్కూళ్లలో టీచర్ల కొరతను తీరుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఏ పాఠశాలలోనూ టీచర్ల కొరత లేకుండా చూస్తామని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కడియం పేర్కొన్నారు. బదిలీలు జరగడం వల్లనే కొన్ని పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడిందని, ఆ స్కూళ్లలో సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రతి జూనియర్ కాలేజీలో, పాఠశాలలో విద్యా వాలంటీర్లు, గెస్టు లెక్చరర్ల ద్వారా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని ఆయన వివరించారు. కాగా, ఉప ముఖ్యమంత్రి శుక్రవారం పాతబస్తీలో ఫలక్‌నుమా ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫలక్‌నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మోడల్‌క్యాంపస్‌గా అభివృద్ధి చేసేందుకు 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా భవనాలను పూర్తి చేయాలని, కేజీ టు పీజీలో భాగంగా ఒకే ప్రాంగణంలో అన్ని తరగతులూ నిర్వహిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలిసి ఆయన ఫలక్‌నుమా పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థినిలకు పాఠాలు చెప్పారు. ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రస్తుతం ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా మంజూరు కావడంతో డిగ్రీ తరగతులు నడపడానికి కావల్సిన వసతులు ఏర్పాటు చేయడంపై అధికారులతో చర్చించారు.
ఫలక్‌నుమా ప్రాంగణంలో ఆరువేల మంది విద్యార్థులు చదువుతున్నారని విశాలమైన స్థలం ఉన్నా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల భవనాలు, వసతులు విద్యార్ధుల అవసరాలకు అనుగుణంగా లేవని అన్నారు. మూడు కోట్ల రూపాయిలతో జూనియర్ కాలేజీ, ఐదు కోట్ల రూపాయిలతో డిగ్రీ కాలేజీ భవనాలు నిర్మించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే విధంగా భవనాలు అన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించడానికి 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అన్నారు. సీఎం తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలుచేస్తున్నారని , దీనిలో భాగంగా ఒకే ప్రాంగణంలో కేజీ టు పీజీ అమలు కానున్న తొలి క్యాంపస్ ఫలక్‌నుమా అవుతుందని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏడాదిలోగా కొత్త భవనాలు నిర్మించి, ఇక్కడ కేజీ నుండి పీజీ వరకూ విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వెంట విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య సంచాలకుడు విజయ్‌కుమార్ , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.