తెలంగాణ

సంక్షేమ భవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: బీసీ, ఎస్‌సి, ఎస్‌టీ విద్యార్థుల కోసం 200 వసతి గృహాలు మంజూరు చేయాలని, వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు బుధవారం సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘాల అధ్యక్షుడు అంజి నాయకత్వంలో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా గుజ్జ కృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లక్షల సంఖ్యలో పేద విద్యార్థులు ఉన్నారని, వారికి వసతి గృహా సౌకర్యం లభించక మధ్యలోనే చదువు నిలిపి వేస్తున్నారని అన్నారు. బీసీ వసతి గృహాల్లో వౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వసతి గృహాల సంఖ్యను పెంచాలని ఆయన కోరారు.
కొన్ని వసతి గృహాల్లో భోజన సదుపాయాలు సక్రమంగా లేవని, డైనింగ్ హాల్స్ లేవని, చెట్ల కింద భోజనాలు పెడుతున్నారని, మంచి నీరు ఉండడం లేదన్నారు. ఇంజనీరింగ్, మెడిసన్ ఫార్మసీ కోర్సులు చదివే వారికి సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ బీసీ వసతి గృహాల గురించి పట్టించుకోవడం లేదని గుజ్జ కృష్ణ విమర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘాల నాయకులు నీల వెంకటేష్, రావులకోలు నరేష్, కొప్పుల జగన్, కె. రాజ్‌కుమార్, శుకూర్, రాజన్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.