తెలంగాణ

కార్మికుల పనిగంటలు మెరుగుపడాలి : సింగరేణి సీఎండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: సింగరేణి గనుల్లో పని చేస్తున్న కార్మికులు తమ పని గంటలను మెరుగుపడాలని, గనుల్లో నిర్దేశించిన లక్ష్యాలను అధికమించడానికి కృషి చేయాలని సంస్థ సీఎండీ శ్రీ్ధర్ సూచించారు. గనుల్లో వేగంగా బొగ్గు ఉత్తత్తికి ఆధునిక యంత్రాలను తీసుకువస్తున్నామని కార్మికులు అందుకు తమ పని గంటలల్లో మెళకువలతోపాటు నైపుణ్యతను సాధించాలన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ గత నాలుగేళ్ళుగా బొగ్గు ఉత్తత్తిలో గణనీయమైన లక్ష్యాలను సాధించిందని అన్నారు. విద్యుత్ థర్మల్ కేంద్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గును సరఫరా చేస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నామని దీనికి కార్మికుల కృషి కారణమని చెప్పారు. 2013-14 సంవత్సరానికి పోలిస్తే 2018-19 సంవత్సరానికి వందశాతం లక్ష్యాలను అధికమించామన్నారు. ఓబీ తొలగింపుల్లో కొంత వెనకబడినప్పటికీ బొగ్గు లోటును భర్తీ చేస్తున్నామని చెప్పారు. పాత యంత్రాలను స్థానంలో కొత్త యంత్రాలను తీసుకురావడం జరిగిందన్నారు. దాదాపు రూ. 315 కోట్లతో కొత్త షవల్స్, డంపర్లు, డోజర్లు, వాటర్ స్ప్రింక్లర్స్ కొనుగోలు చేశామన్నారు. కొత్తిగా 13 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని, వీటిలో 7 ఓసి గనులు, 6 భూగర్భ గనులు ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. థర్మల్, సౌర విద్యుత్‌తో సింగరేణికి అధిక లాభాలు రానున్నాయని చెప్పారు. కారుణ్య నియామకాలతో కార్మిక కుటుంబాల ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నాడు సింగరేణి భవనంలో 72వ స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పని గంటల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన సంస్థ అధికారులకు, కార్మికులకు ఉత్తమ సేవా పథకాలను అందించారు.