తెలంగాణ

కరుణించిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 17: తెలంగాణలో ఆశించిన వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. కరుణించిన కృష్ణమ్మ నాగార్జున సాగర్‌కు పరుగున వస్తుండగా ఆయకట్టు రైతుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండగా మారడంతో నేడు గేట్లు ఎత్తివేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఫలితంగా సాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మరింత పెరుగనుంది. ఆయా ప్రాజెక్టుల నీటి మట్టాలను సమీక్షించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి టీ. హరీష్‌రావు సాగర్ ఎడమకాలువకు 22నుండి నీటి విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలివ్వడంతో, రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో శుక్రవారం రాత్రికి 878.7అడుగులు నీటి మట్టం ఉండగా మరో ఏడు అడుగులతో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర, ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుండి 3లక్షల 18,106 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నేడు కచ్చితంగా గేట్లు ఎత్తివేసే అవకాశముంది. శ్రీశైలం నుండి కుడి, ఎడమకాలువల విద్యుత్ కేంద్రాల నుండి నాగార్జున సాగర్‌కు 81,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. వరద ఉద్ధృతి నిలకడగా ఉండటంతో శనివారం శ్రీశైలం గేట్లు ఎత్తనుండగా నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు మరింత పెరుగనున్నాయని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. శుక్రవారం రాత్రి కల్లా నాగార్జున సాగర్‌లో 530 అడుగుల నీటి మట్టం ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఇన్‌ఫ్లో 81వేల క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణా డేల్టాకు 1,103 క్యూసెక్కులు, కుడి కాలువకు 7,253 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కుల అవుట్ ఫ్లోగా కొనసాగుతుంది.