తెలంగాణ

నారుూ బ్రాహ్మణులకు ఇచ్చిన వరాలు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నీ అబద్దాలే చెప్పారని, రాష్ట్రంలో నారుూ బ్రాహ్మణులకు చేయని సహాయాన్ని చేసినట్లుగా చెప్పుకున్నారని టీ.పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన నారుూ బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ మాట చెప్పినా, ఆ మాటకు విలువ ఉంటుందన్నారు. కానీ ముఖ్యమంత్రి హామీలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ఆచరణలో కనిపించడం లేదని డాక్టర్ శ్రవణ్ విమర్శించారు. నారుూ బ్రాహ్మణులకు విద్యుత్తు టారీఫ్‌ను కమర్షియల్ నుంచి డొమెస్టిక్‌కు మార్చినట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. 2016 సంవత్సరం జనవరి 6వ తేదీ నుంచి వారికి డొమెస్టిక్ టారీఫ్ అమలు చేయడానికి వీలుగా జివో ఎంఎస్ నెం.1 విడుదల చేసినట్లు చెప్పినా, ఇంత వరకు ఆచరణలోకి రాలేదని, ఇది ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడమా? లేక అధికారుల నిర్లక్ష్యమా అని ఆయన ప్రశ్నించారు. నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్‌ను ప్రకటించినా పాలక మండలిని ప్రకటించలేదని డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు. ఇలాఉండగా కొంత మంది నారుూ బ్రాహ్మణులు గడ్డాలు గీస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.