తెలంగాణ

ముందస్తుకు సిద్ధమవుతున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో తొలుత రెండు భారీ బహిరంగ సభల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 12 లేదా 15వ తేదీన మహబూబ్‌నగర్‌లోనూ, అనంతరం కరీంనగర్‌లో ఈ సభలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బూత్‌స్థాయి కమిటీల సభ్యులతో నియోజకవర్గాల వారీ సమావేశాలను నిర్వహించారు. ఇటీవల కొంగరకొలాన్‌లో సీఎం భారీ ఎత్తున సభను నిర్వహించిన నేపథ్యంలో ఆ స్థాయిలో మిగిలిన పార్టీలు సభలను నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి సభలు అన్నీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే నిర్వహించనున్నట్టు తెలియవస్తోంది. ఎన్నికల సమయంలో బీజేపీ-టీఆర్‌ఎస్‌ల కూటమిని కొట్టిపారేయలేమని కూడా పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కొత్త మున్సిపాల్టీల్లో పుట్టుకతో చార్జీలా?
కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాల్టీల్లో నెల రోజులు తిరగకముందే పన్నులు, చార్జీల పెంపుతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి కొత్తగా ఏర్పాటైన 68 మున్సిపాల్టీలతో పాటు వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనమైన 131 గ్రామ పంచాయితీల్లో కూడా ఖాళీ స్థలాలపై పన్నులు, నల్లా చార్జీలు, మార్కెట్ ఫీజులు, పశువధ శాలలు ఫీజులు, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, మ్యుటేషన్ ఫీజులు, వినోద పన్ను, స్టాంప్ డ్యూటీపై సర్‌ఛార్జీలను పెంచుతూ పురపాలక శాఖ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడం అన్యాయమని అన్నారు. దశాబ్దాలుగా గ్రామీణ వాతావరణానికి అలవాటుపడ్డ లక్షలాది మంది ప్రజలను, మున్సిపాల్టీల పరిస్థితులకు అనుగుణంగా ఇంకా మారలేదని, అపుడే ప్రభుత్వం పన్నులు బాది పట్టణ రుచులను చూపించాలనుకోవడం శోఛనీయమని అన్నారు.