తెలంగాణ

టీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 5: ప్రజలను మాటలతో మభ్యపెడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర, వామపక్ష వాదులతో కలిసి విశాల వేదికను ఏర్పాటు చేయనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన విధానాలకు వ్యతిరేకంగా పనిచేసి రెండు పార్టీలు ప్రజలను మోసం చేసాయన్నారు. కనీసం ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా పూర్తిగా విఫలం చెందాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలతో పొత్తు పెట్టుకునే పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తాము బలంగా ఉన్న 50స్థానాలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. అయితే పొత్తులు కుదిరితే కొన్నింటిని వదులుకునేందుకు సిద్ధమన్నారు. ఎన్నికలలో పోటీ విషయంపై తెలంగాణ జనసమితితో, టీడీపీతో చర్చలు జరిగాయని, కాంగ్రెస్‌తో మాత్రం ఎటువంటి సమావేశం కూడా నిర్వహించ లేదని, ఆర్ కృష్ణయ్య, మందకృష్ణలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల విషయమై కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందని, కాని ప్రస్తుతం ఆ పార్టీ ఆ పరిస్థితులలో లేదన్నారు.
సీపీఎం కూడా తమతో చర్చలు జరుపుతున్నదన్నారు. అయితే బీఎల్‌ఎఫ్ రాజకీయ వేదిక కాదనే తమ అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలకు చెప్పామన్నారు. కాగా అభద్రతతో నిరాశలో ఉన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మాటలతో ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగానే ఈ నెల 10వ తేదిన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. సభలు, సమావేశాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు 3 అసెంబ్లీ స్థానాలలో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలోపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు పాల్గొన్నారు.