తెలంగాణ

కంటివెలుగు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ప్రభుత్వం చేపట్టిన ‘కంటివెలుగు’ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందని ప్రభుత్వ ప్రధన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి తెలిపారు. సచివాలయంలో ఉద్యోగుల కోసం బుధవారం ఆయన కంటివెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది లబ్దిపొందుతున్నారని వివరించారు. సాధారణ పౌరులతో పాటు ఉద్యోగులకు కూడా కంటిపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు చేస్తున్న కంటిపరీక్షల్లో భాగంగా సచివాలయంలో వైద్య శిబిరం ఏర్పాటైందని వివరించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తర్వాత జోషి స్వయంగా కంటిపరీక్షలు చేయించుకున్నారు. జోషితో పాటు ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ (జీఏడి) ముఖ్యకార్యదర్శి అదర్ సిన్హా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.