తెలంగాణ

అభివృద్ధికి కేరాఫ్ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, సెపెంబర్ 5: కొట్లాడి తెచ్చిన తెలంగాణలో మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగేళ్లలో ఏట్లా అభివృద్ధి చేసినమో వివరించడం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 7వ తేదీన సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌కు వస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌లు అన్నారు. ఈ బహిరంగసభకు అధిక ప్రజలు హాజరై ఆశీర్వదిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అబివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని మీ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. బుధవారం సీఎం బహిరంగ సభ విజయవంతం చేసే అంశంపై అక్కన్నపేట హుస్నాబాద్ రూరల్, టౌన్ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో స్థానిక కేజీఆర్ గార్డెన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి వార్డు నుండి ఒక్కో కౌన్సిలర్‌తో ఎంతమందిని సమకూర్చగలరో వివరాలను అరాతీశారు. రాష్టంలో కోటి ఎకరాలకు నీరందించే దిశగా నేడు కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పనుల జరుగుతున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో కురిసిన నీళ్లు మన నదుల మీదుగా వృథాగా పోతున్నాయని.. రాబోవు రోజుల్లో ఒక్క చుక్క నీరు వృథాగా పోకుండా ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో అన్ని ప్రాంతాలకు నీరందించి కరువును నివారిస్తామని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ అభివృద్ధికి కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేయస్తున్నామని చెప్పారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే భారీ బహీరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాతూరి సుదాకర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, సిద్దిపేట మేయర్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.