తెలంగాణ

ముందస్తు ఎన్నికలతో బిల్ట్‌కు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 5: ముందస్తు ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలిసిరానుంది. జయశంకర్ భూపాపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురంలో అంపశయ్య మీద ఉన్న బిల్ట్‌కు కలిసి వచ్చింది. పల్ప్‌కు మార్కెట్ లేదంటూ గత నాలుగున్నర ఏళ్ళ క్రితం కార్మగారంలో యాజమాన్యం ఉత్పత్తి నిలిపివేసినప్పటి నుండి ఆర్థిక, మానసిక ఇబ్బందులు పడ్డ బిల్ట్ కార్మిక, కార్మిక కుటుంబాలకు మళ్ళీ మంచి రోజులు రానున్నాయి. కర్మాగార మనుగడ కోసం కార్మికుల సహకారంలో కార్మిక నాయకులు నాలుగేళ్ళకు పైగా చేస్తున్న కృషికి బుధవారం ఫలితం దక్కింది. బిల్ట్ కర్మాగారానికి 550 కోట్ల రాయితీతో పాటుగా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్‌మిల్‌కు ఇచ్చిన విధంగానే బిల్ట్ కర్మాగారానికి కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ రాయితీలకు సంబందించిన ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో బిల్ట్ కార్మికుల, కార్మిక కుటుంబాలలో ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి. నాలుగున్నర సంవత్సరాలుగా బిల్ట్ కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్‌ల చొరవతో కార్మికులకు మంచి రోజులు వచ్చాయి. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మిక కుటుంబాలతో పాటు కర్మాగారంపై పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలు రుణపడి ఉంటాయని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక భారీ పరిశ్రమగా ఉన్న బిల్ట్ కర్మాగారం ఉండడంతో ఒక వెలుగు వెలిగిన కమలాపురం గత నాలుగున్నర ఏళ్ళుగా బిల్ట్ కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో చిన్నబోయింది. బుధవారం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కమలాపురంకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని కార్మికులు, కమలాపురం గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాలతో బుధవారం రాత్రికి పూర్తి స్థాయిలో సంబందిత పత్రాలు పూర్తయితే తప్ప కర్మాగారానికి రావాల్సిన సబ్సిడీల విషయంలో సందేహం పడాల్సి వస్తుందనే ఊహాగానాలు వినవస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నాం 12 గంటల కన్నా ముందే సీఎం కేసీఆర్ బిల్ట్‌కు రాయితీల కేటాయింపు ఫైల్‌పై సంతకం చేసినప్పటికీ సాయంత్రం వరకు బిల్ట్ ఉన్నత స్థాయి యాజమాన్యం ఫైల్‌ను తీసుకునేందుకు ముందుకు రాలేదని కార్మికులు చర్చించుకుంటున్నారు.
బిల్ట్ కమలాపురం యూనిట్ హెచ్‌ఆర్ డీజీయం కేశవరెడ్డి హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లోనే ఉండి విషయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వం ఇచ్చిన ఫైల్‌ను తీసుకునేందుకు బిల్ట్ ఉన్నత స్థాయి యాజమాన్యంలోని డీజీయం హెచ్‌ఆర్ గానీ సీఈఓ స్థాయి అధికారి కానీ రావాల్సి ఉందని అయితే బుధవారం సాయంత్రం వరకు వారు ఎవరూ రాలేదని కార్మికులు చర్చించుకోవడం గమనార్హం. ఈ విషయంపై బిల్ట్ కమలాపురం హెచ్‌ఆర్ డీజీఎం కేశవరెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.