తెలంగాణ

జగిత్యాలలో పాక్ అనుకూల నినాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 5: జిల్లా కేంద్రమైన జగిత్యాల తీన్‌ఖని చౌరస్తాలో జాతీయ జెండా గద్దె నిర్మాణ పనులు అడ్డుకొని భారత దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఓ వర్గానికి చెందిన కొంతమంది యువకులు నినాదాలు చేయడం జగిత్యాలలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘటనపై బుధవారం ఏబీవీపీ, బీజేపీ, విహెచ్‌పీ, హిందూ వాహిని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి ధర్నా, రాస్తారోకో చేయడంతోపాటు సదరు వర్గం తీరుపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా, రాస్తారోకో చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ జెండాకు గద్దె నిర్మాణాన్ని అడ్డుకోవడం సరైన చర్య కాదన్నారు. దేశ సమైక్యత పెంపు కోసం పోలీస్, మున్సిపల్ ఆధ్వర్యంలో జాతీయ జెండా నిర్మించాలని చూస్తే భారత దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నినాదాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే చర్యకు పూనుకోవడం విచారకమన్నారు. జాతీయస్థాయి దర్యాప్తు బృందంతో విచారణ జరిపించి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినవారిని గుర్తించి దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.