తెలంగాణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెల్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, సెప్టెంబర్ 7: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెల్చుకున్నా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని రాజీవ్ స్మారక భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. తాను మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అధిష్ఠానం కూడా తనకు టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజల మద్దతుతో మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసి తన ఓటమికి కారణమయ్యారని పేర్కొన్నారు. అమెకు ఈ ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లి తన గోయి తానే తవ్వుకున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావడం కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నేరచరిత్ర కల్గిన వారికే టికెట్లు ఇచ్చిందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. రైతుబంధు పథకం పేరుతో భూస్వాములకు డబ్బులు పంచిపెట్టాడని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహ చేస్తున్నారని ధ్వజమెత్తారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ 250 కోట్లతో చేపట్టిన పిలాయిపల్లి కాలువ మీద లేదన్నారు. డిండి ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నాలుగేళ్లు కావస్తున్నా పది శాతం పనులు కూడా జరగలేదన్నారు. మాటల గారడీతో మాయ చేయడం తప్ప పనులు ఎక్కడా లేవన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిక్కా నరసింహా, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, మల్కాపురం నరసింహా, తాడూరి పరమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.