తెలంగాణ

పాలించలేని వారికి మళ్లీ అధికారమివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 7: ఎన్నో ఉద్యమాలు, బలిదానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారమిస్తే పాలించలేమని తన సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్‌కు ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధి పేరుతో టీజేఎస్ జిల్లా ఇన్‌చార్జి కుంట్ల ధర్మార్జున్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయా త్ర ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు ఐదేళ్లు పాలించాలని అధికారమిస్తే కేసీఆర్ 9నెలముందే రాజీనామా ఇచ్చారన్నారు. 60ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేరిందని ప్రజలు ఆశించగా కేసీఆర్ అందుకు భిన్నంగా పాలన కొనసాగించారని ధ్వజమెత్తారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో ప్రజల ప్రయోనాలను విస్మరించి వ్యక్తిగతంగా తమకు లబ్ధి చేకుర్చే పనులకే ప్రాధాన్యతనిచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఉద్యోగాలు, సమస్యలపై ఉద్యమించిన వారిపై నిర్బంధాన్ని కొనసాగించారన్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి ప్రజలను ఓట్లు అడిగే నైతికహక్కులేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని మంటగలిపిన ఆ పార్టీకి సరైన రితీలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ పీడ విరగడయ్యిందన్న సంతోషంలో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ప్రజలు డబ్బుల కోసం ఓట్లు వేయకుండా పనిచేసే వారిని గుర్తించి ఆదరించాలని కోరారు. తెలంగాణ జనసమితి ఆ దిశగా పనిచేస్తున్నందున తమకు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామన్నారు. ఈ సభలో హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి, టీజేఎస్ నాయకులు గోపాల్‌శర్మ, వెంకట్‌రెడ్డి, చింత స్వామి, గురజాల రవీందర్, కనకయ్య, శంభారెడ్డి, లింగస్వామి, ఖలీల్, ప్రభాకర్, నాగిరెడ్డి, రమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.