తెలంగాణ

కేసీఆర్‌తో గొడవ పెట్టాలని చూశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య గొడవ, చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యర్థులను అణగదొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఓ చారిత్రక అవసరం ఉందన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో, ముఖ్య నాయకులతో అత్యవసరంగా సమావేశమై మంతనాలు జరిపారు.
అదేవిధంగా ఏర్పాటైన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ తెలంగాణలో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారని అన్నారు. వారి రుణం తీర్చుకోలేదని, 36 ఏళ్ళుగా ఎన్నో త్యాగాలు చేస్తూ పార్టీని కాపాడుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. త్యాగాలకు తమ పార్టీ మారు పేరు అని ఆయన చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కావడం వెనుక పార్టీ కష్టం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రపంచం మొత్తం తిరిగాననని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు.
లోగడ ఆంధ్ర ప్రదేశ్‌ను విభజన చేయాలని కానీ, విభజన చేయోద్దనిగానీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. విభజన చట్టంలో ఏపీకి అన్యాయం జరిగిందని విమర్శించారు. రాష్ట్రాల మద్య విభజన సమస్యల పరిష్కారానికి తాము కేంద్రంపై పోరాడానని, అందుకే ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెట్టామని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్రధాని మోదీ తనకు, కేసీఆర్‌కు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారని అన్నారు. విభజన చట్టం అమలు చేయాలని తాను పట్టుబడితే అభాండాలు వేశారని చంద్రబాబు తెలిపారు. నేషనల్ ఫ్రంట్ పెట్టింది టీడీపీనేనని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీ హయాంలో బ్యాంకుల్లో జరిగిన అవినీతితో బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం పోయిందని, పెట్రోలు లీటర్‌ను త్వరలో వంద రూపాయలు చేస్తారని ఆయన విమర్శించారు. రూపాయి విలువ పడిపోయిందని ఆయన తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, విలువలు శాశ్వతమని అన్నారు.