తెలంగాణ

వివాదాల పరిష్కార కేంద్రంగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: భారతదేశం నమ్మదగిన ఆర్బిట్రేషన్ కేంద్రంగా మారుతోందని, అయితే భారత్‌లో కూడా సంస్థాగత వివాదాల పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) కార్యదర్శి జెఎల్‌ఎన్ మూర్తి పేర్కొన్నారు. ‘వ్యాపార మనుగడ - వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం న్యాయ సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
సరిహద్దు పెట్టుబడి, వాణిజ్యం విస్తరణ, ప్రపంచీకరణతో వ్యాపారాలు, పెట్టుబడిదారులు, రాష్ట్రాల మధ్య వివాదాలు కూడా పెరగడంతో సంక్లిష్ట బహుళజాతి వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాల పద్ధతికి దారితీసిందని అన్నారు.
సంస్థాగత పరిష్కారాలకు భారత్‌లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు ఆర్బిట్రేషన్ స్థావరాలుగా మారాయని, భారత్ కూడా న్యాయ సంస్కరణలకు ముందుకు రావాలని చెప్పారు. ఆగస్టు 20వ తేదీన భారత ప్రభుత్వం వాణిజ్య కోర్టులు, కమర్షియల్ డివిజన్- వాణిజ్య అప్పీలెట్‌ల డివిజన్లకు అవకాశం ఇవ్వడం గొప్ప మార్పునకు దారితీస్తుందని అన్నారు. అలాగే వినియోగదారుల పరిరక్షణ చట్టం -2018 కూడా ఎంతో ఆర్బిట్రేషన్‌కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకురావడం ఉత్తేజాన్ని తెచ్చి పెట్టిందని చెప్పారు.
వర్డిక్ట్ ఐపీ సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ రాం కుమార్ మాట్లాడుతూ పేటెంట్ చట్టంలో సవరణలు తేవాలని లేదా సమగ్ర పేటెంట్ చట్టాన్ని తీసుకురావాలని, కనీసం ఐదేళ్ల పాటు దరఖాస్తు చేసిన వారందరికీ పేటెంట్ ఇవ్వాలని, అపుడే పేటెంట్‌లపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ వామన రావు మాట్లాడుతూ వివాదాల పరిష్కార న్యాయ ప్రక్రియ సైతం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందని, మేథోసంపత్తి హక్కులు, డిజైన్ చట్టం, పేటెంట్ చట్టం వంటి నూతన అంశాలపై న్యాయమూర్తులకు నిరంతర శిక్షణ అందించాలని, నూతన అంశాలపై న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు అవగాహన పెంచాలని జస్టీస్ వామనరావు సూచించారు. ఐసీఏడీఆర్, సీఐఐ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.
న్యాయవాదులు కూడా కొత్త అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, ఏమీ తెలుసుకోకుండానే కొంత మంది న్యాయవాదులు కోర్టుల్లో కేసులు వాదించడానికి వస్తున్నారని, ఇది కించపరచడం కాదని, వారు జ్ఞాన సముపార్జన చేసుకోవాలనే తాను సూచిస్తున్నట్టు చెప్పారు.
అనంతరం కేఎండ్‌ఎస్ పార్టనర్ సంజీవ్ కే తివారి, సీఐఐ తెలంగాణ డైరెక్టర్ సుభాజిత్ సాహ, ఫరీదుద్దీన్ మాట్లాడారు. కార్యక్రమానికి నరేందర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.