తెలంగాణ

ఆ ఇద్దరి కోసం మరో ఇద్దరికి ఎసరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: చెన్నూరు, చొప్పదండి టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించడానికి సర్వేలు కారణం కాదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జీ. వివేక్‌కు పెద్దపల్లి నుంచి పార్లమెంట్ టికెట్, ఆయన సోదరుడు, మాజీ మంత్రి జీ. వినోద్‌కు చొప్పదండి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికే సిట్టింగ్‌లకు టికెట్ దక్కలేదని సమాచారం. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్‌కు లైన్ క్లియర్ చేసినట్టు తెలిసింది. అలాగే చొప్పదండి నుంచి వినోద్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికే బొడిగ శోభకు టికెట్ ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. దివంగత కాంగ్రెస్ నేత జీ. వెంకటస్వామి ఇద్దరు కుమారుల కోసం ఇద్దరు సిట్టింగ్‌ల టిక్కెట్లు గల్లంతుకు కారణమైందని ఈ వర్గాల సమాచారం. టికెట్ నిరాకరించేందుకే ముందస్తు వ్యూహంతో పార్టీ అధినేతకు బొడిగ శోభపై ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. ఇలా ఉండగా పలు సందర్భాల్లో వివాదాల్లో ఇరుక్కున్న ఐదుగురు సిట్టింగ్‌లకు తిరిగి టిక్కెట్లు ఖరారు చేయడం కూడా పార్టీ వర్గాలలో విమర్శలవుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నక్రెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పలు వివాదాలను ఎదుర్కొన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ కలక్టర్‌తో దేవసేనతో గొడవపడగా, శంకర్ నాయక్ అయితే మహబాబాబాద్ కలక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడం పట్ల స్వయంగా సీఎం కేసీఆరే మందలించి క్షమాపణ చెప్పించిన విషయం తెలిసిందే. అలాగే నక్రెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దుర్గం కనకయ్య, ధర్మారెడ్డి అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగాయి. వీరిపై చర్య తీసుకోవాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ కూడా చేసాయి. అయితే టిక్కెట్ల ఖరారులో ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉండగా ముగ్గురు సిట్టింగ్‌లు తమ నోటి దురుసుతనం వల్ల టికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. వరంగల్ ఈస్ట్ సిట్టింగ్ కొండా సురేఖ తన కూతురికి ఎమ్మెల్యే టికెట్ కోసం ఏకంగా స్పీకర్ మధుసూదనాచారిపై తీవ్ర విమర్శలు చేయడం వల్లనే టికెట్ ప్రకటించకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి స్పీకర్‌కు తిరిగి టికెట్ ఇస్తే ఓడిపోతాడని కొండా సురేఖ బహాటంగా వ్యాఖ్యానించడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. మేడ్చెల్ సిట్టింగ్ సుధీర్‌రెడ్డి కూడా ఆయన నోటి దురుసుతనం వల్లనే అవకాశం కోల్పోయారని సమాచారం. పలు సందర్భాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఈయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యామాల్లో వైరల్ అయ్యాయి.
పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరించడం వల్లనే అధిష్ఠానం సుధీర్‌రెడ్డికి టికెట్ నిరాకరించడానికి కారణమని భావిస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగ శోభకు టికెట్ ఇవ్వవద్దని స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత కేసీఆర్‌కే నేరుగా ఫిర్యాదు చేసారు. ప్రతీ ఒక్కరి పట్ల అహంకారంతో నోటి దురుసుగా వ్యవహరిస్తుందని వారు ఫిర్యాదు చేయడం వల్లనే టికెట్ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతుండగా, అలాంటిదేమి లేదు మాజీ మంత్రి వినోద్‌కు టికెట్ ఇవ్వడానికే తనపై తప్పుడు ఫిర్యాదు చేయించినట్టు శోభ తన అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం.