తెలంగాణ

విద్యార్థిని నిర్బంధించి చితకబాదిన అధ్యాపకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 8: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో శనివారం ఓ విద్యార్థిని గదిలో నిర్భందించి ప్రిన్సిపాల్ సహా అధ్యాపకులు చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చే యించారు. విద్యార్థి చెప్పిన వివరాల ప్రకారం.. గీతాంజలి జూనియర్ కళాశాలలో సెలవులలో కూడా తరగతులను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు కారణం కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతున్న ఆది త్య అని తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ముగ్గురు అధ్యాపకులు ఆ విద్యార్థిని ఒక గదిలోకి తీసుకెళ్లి పైపుతో చితకబాదారు. తీవ్రగాయాలతో స్పృహ తప్పిన ఆదిత్యను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియచేయడంతో వెంటనే వారు వచ్చి ఘటన గురించి తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తీరుపై బాధిత విద్యార్థి తండ్రి శివయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవుల్లోనూ తరగతులను నిర్వహిస్తూ పిల్లలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కళాశాల తీరుపై పలు విద్యార్థి సంఘాలు కూడా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.