తెలంగాణ

మెదక్ జిల్లాలో మత్య్స పరిశ్రమకు వర్షం దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, సెప్టెంబర్ 11: మెదక్ జిల్లాలో మత్య్స పరిశ్రమ వెలవెలబోతోంది. వర్షాలు లేక జిల్లాలో చేపల ఉత్పత్తిని అనుకున్న లక్ష్యాన్ని జిల్లా అధికారులు సాధించలేకపోతున్నారు. జిల్లాలో 1591 చెరువులు ఉన్నాయని, అందులో 1273 గ్రామపంచాయితీలు, 315 డిపార్ట్‌మెంట్ చెరువులు, మూడు రిజర్వాయర్లు ఉన్నట్లు జిల్లా మత్య్సశాఖ ఇంచార్జీ అధికారి శ్రీనివాస్ మంగళవారం మాట్లాడుతూ తెలిపారు. చేప విత్తనాలు 4.50 కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. మంగళవారం కైకలూర్ నుండి 7 లక్షల చేప పిల్లల విత్తనాలు రప్పించినట్లు తెలిపారు. అందులో బొత్స, రోహు, బంగారుతీగ చేప పిల్లల విత్తనాలు ఉన్నాయన్నారు. రాయిన్‌పల్లి చెరువులో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఇటీవల 2.43 లక్షల ప్రింగర్ లింగ్స్ విత్తనాలను లాంచ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం కేవలం 40 చెరువుల్లో మాత్రమే నీళ్లు ఉన్నట్లు తెలిపారు. పోచారం రిజర్వాయర్‌లో 12 లక్షల 47 వేల చేప వ్తితనాలు వేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు రాకపోతే చేపల ఉత్పత్తికి కరువుదెబ్బ తగులుతుందన్నారు. వర్షాలు లేక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. సంపూర్ణంగా వర్షాలు ఉండి చెరువుల్లో, ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నప్పుడు లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు. జిల్లాలో 215 సొసైటిలు ఉన్నాయని, 14 మహిళా సొసైటిలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండు సొసైటిల్లో 12604 సభ్యులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సమీకృత మత్య్స అభివృద్ది పథకం నుండి మత్య్స కార్మికులకు 75 శాతం సబ్సిడితో వాహనాలు అందజేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. బైక్‌లకు మూడు వేల దరఖాస్తులు రాగా 2800 మంది డీడీలు కట్టారని తెలిపారు. ఈ వాహనాలను త్వరలో పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఫోర్‌వీలర్స్ వాహనాలు రాష్ట్ర స్థాయి కంపెనీలకు సంబంధించిన అశోక్ లైలాండ్, మారుతి, మహీంద్ర, టాటా కంపెనీల ద్వారా 150 మంది అర్హులుగా గుర్తించి వీటిని పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ వాహనాలను లాటరీ పద్దతిలో పంపిణీ జరుగుతుందన్నారు. వలలు, కిట్స్ పంపిణీ చేస్తామన్నారు. ఇన్సులేటర్ ట్రక్ జిల్లా సొసైటికి 20 లక్షల వాహనాన్ని అందజేయబోతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు వంద మందిపైన ఉన్న సభ్యులకు ఐదు లక్షల రుపాయలు, వందలోపు ఉన్న సభ్యులకు మూడు లక్షల రుపాయలు చేపల మార్కెటింగ్ కోసం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మత్య్స కార్మికులను ఆదుకోడానికి ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.