తెలంగాణ

పేట కాంగ్రెస్ టికెట్ ఎవ్వరికో ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రేవంత్‌రెడ్డిపైనే రమేష్‌రెడ్డి ఆశలు * గెలిచే వారికే టికెట్ వస్తుందంటూ పటేల్ ప్రకటనలు
సూర్యాపేట, సెప్టెంబర్ 11: రాష్ట్ర శాసనసభ రద్దు.. ముందస్తు ఎన్నికల సంకేతాలు స్పష్టమవుతున్న తరుణంలో రాష్టవ్య్రాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరిని వరిస్తుందోనన్న అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతుందా ? ఏడాది క్రితం రేవంత్‌రెడ్డితో కలిసి పార్టీలో చేరిన పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డిని వరిస్తుందా? అన్న ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు ఏకంగా టీఆర్‌ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన పార్టీ అధినేత కేసీఆర్ సూర్యాపేట స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి కేటాయించారు. దీంతో మంత్రి శ్రావణమాసం చివరిరోజున మంచి ముహుర్తంగా భావించి ఆయన తన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. కేసీఆర్‌కు సన్నిహితునిగా పేరున్న మంత్రి జగదీశ్‌రెడ్డిపై విపక్ష కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశమైంది. సీనియర్ కాంగ్రెస్ నేతగా రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రాష్ట్రంలో ప్రధాన నాయకునిగా పేరుగాంచారు. ఏఐసీసీ స్థాయిలో గుర్తింపు కలిగి ఉన్న నాయకుడైన దామోదర్‌రెడ్డి పార్టీ టికెట్ తనకు ఖాయమనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఏకంగా శ్రావణ శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలుచేసి ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు వివిధ వర్గాలతో సంప్రదింపులు సైతం సాగిస్తున్నారు. నెలరోజుల క్రితం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దామోదర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చేసిన వ్యాఖ్యలే ఆర్డీఆర్ టికెట్ ఖాయమని తేల్చినట్లుగా ఆయన వర్గీయులు ధీమాగా ఉన్నారు. కాగా, గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసిన పటేల్ రమేష్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల దరిమేలా రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన సమయంలో రాహుల్‌గాంధీతో సంప్రదింపులు జరిపి సూర్యాపేట సీటును ఇస్తామనే హామీతోనే కాంగ్రెస్‌లో చేరినట్లుగా ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చినందునే పార్టీలో చేరినందున రమేష్‌రెడ్డికి తప్పక టికెట్ వస్తుందని, ఆ దిశగా రేవంత్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు. నిరుద్యోగ ర్యాలీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా చేసినట్లు ఆ తర్వాత ఆయనే ప్రకటించినందున రమేష్‌రెడ్డికి సీటు ఖాయంగా ఆ వర్గీయులు నమ్మకంతో ఉన్నారు. దామోదర్‌రెడ్డి, రమేష్‌రెడ్డిల చేరికతో నియోజకవర్గంలో పార్టీ బలం పెరిగిందని, పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ఉత్సహంగా ఉన్నారు. నిరుద్యోగ చైతన్యయాత్ర సందర్భంగా ఆర్డీఆర్, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య కొంత దూరం పెరిగినా ఆ తర్వాత మళ్లీ కలిసి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే టికెట్ వ్యవహరంలో చుక్కెదురైతే ఐక్యత కొనసాగుతుందో.. లేదోనన్న ఆందోళన కేడర్‌లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆర్డీఆర్ ప్రచారం ప్రారంభించగా ప్రజాబలమున్న నేతలకే అధిష్ఠానం టికెట్ కేటాయిస్తుందంటూ రమేష్‌రెడ్డి చేసిన ప్రకటనతో అభ్యర్థిత్వంపై ఉత్కంఠత మరింత పెంచింది. ఎవరికీ వారే తమకే టికెట్ వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఎవ్వరికీ దక్కుతుందోనన్న ఆసక్తి అన్ని వర్గాల వారిలో వ్యక్తమవుతోంది. ఇద్దరు నేతలు ఎవరికీ వారు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నందున తొలి జాబితాలో ఉంటుందోలేదోనన్న వాదనలు కూడా వినవస్తున్నాయి.