తెలంగాణ

అప్పుల్లో ముంచింది కేసీఆరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని టీడీపీ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ మహాకూటమిని ప్రశ్నించే హక్కు హరీష్‌రావుకు లేదని అన్నారు. ఉద్యమంలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అంతా ఏకమై పోరాటం చేశామని, టీఆర్‌ఎస్ కూడా టీడీపీతో జతకట్టి పనిచేసిన పార్టీయేనని, ఇపుడు టీడీపీని విమర్శించడం అర్ధరహితమని అన్నారు. కేసీఆర్ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అసెంబ్లీని ఎందుకు రద్దుచేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సీఎం సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ అప్రజాస్వామిక విధానాల వల్ల ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని, అందువల్లే ముందస్తు ఎన్నికలను కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు.
మహాకూటమి అధికారంలోకి వస్తే పదిచ చుక్కల నీరు ఎక్కువగానే తెలంగాణకు వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా మహాకూటమి పనిచేయడం జరుగుతుందని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపించమని అడగడటంలో తప్పేముందని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిప్రాజెక్టును నిర్మిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను కేసీర్ ఎందుకు మరిచిపోయారని నిలదీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటుపై భయబ్రాంతులకు గురై ఎలా కడతారని అంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కుదర్చుకోలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ దీనిని ధరల రాష్ట్రంగా మార్చేసిందని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని బీజేపీ మండగలిపిందని ఆయన విమర్శించారు.