తెలంగాణ

హైదరాబాద్-వాడీ మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఈ నెల 23,24, 25వ తేదీలో వాడీలో జరగనున్న హజరత్ కవాజ్ సయ్యద్ ఉత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళనున్న భక్తులక కోసం హైదరాబాద్, వాడీ మధ్య ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే సిపీఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు. 23వ తేదీ (ఆదివారం) 07025 ప్రత్యేక రైలు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వాడీకి సాయంత్రం 4.55 గంటవకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం అదేరోజు రైలు నెంబర్ 07026 వాడీ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. 25వ తేదీన ఉయదం 5 గంటలకు బయలుదేరి వాడీకి 10.15 గంటలకు చేరుకుంటుంది, అదే రైలు వాడీలో 11.05 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
కాచిగూడ- నాగర్‌కోయిల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
కాచిగూడ- నాగర్‌కోయిల్ మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరు సమయాన్ని మార్పులు చేర్పులతో పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరైలు బుధవారం నుంచి ప్రారంభించినట్లు దక్షణమధ్య రైల్వె తెలిపింది. ఈ సాయంత్రం 4 గంటలకు బదులుగా రాత్రి 8.30 గంటలకు బయలు దేరుతుందని వెల్లడించింది.

సికింద్రాబాద్- ధన్‌పూర్ రైలు మళ్ళింపు
సికింద్రాబాద్- ధన్‌పూర్ మధ్య నడిచే 12791 రైలు స్వల్పంగా రూట్ మార్చినట్లు దక్షణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అల్హాబాద్, బాదోయ్, వారణాసి మీదుగా నడిచే ఈ రైలును గ్యాన్‌పూర్ రోడ్డు మీదుగా బులాన్‌పూర్ స్టేషన్ల నుంచి నడుస్తుందని అధికారులు తెలిపారు.

బీజేపీతో కేసీఆర్‌కు రహస్య ఒప్పందం
హైదరాబాద్, సెప్టెంబర్ 12: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తనకు తాను చాలా పెద్ద మేధావినని భ్రమపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. అందరికంటే ఎక్కువ మోసం ఎవరు చేస్తారో వారే మేధావని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులన్న విషయాన్ని మరచిపోరాదన్నారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త అనిరుద్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటైన సభలో జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ అనిరుద్ చేరికతో జడ్చర్లలో పార్టీ మరింత బలపడిందన్నారు. బీజేపీతో కేసీఆర్‌కు రహాస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ-టీఆర్‌ఎస్ కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు వెళ్ళారన్నారు. కేసీఆర్ తనకు చెంచాగిరి చేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన విమర్శించారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల అసంతృప్తి ఉందని, కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత ఉందని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించనున్నదని జైపాల్ రెడ్డి అన్నారు.