తెలంగాణ

రాష్ట్ర చరిత్రను శోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ పురావస్తు చరిత్ర వారసత్వ సంపదకు సంబంధించి సమగ్ర పరిశోధనలు జరగాలని సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి- చరిత్ర, వారసత్వ సంపద అనే అంశంపై బుధవారం నాడు తెలుగు యూనివర్శిటీలో తెలంగాణ విద్యా, సామాజిక సాంస్కృతిక సాహిత్య వేదిక నిర్వహించిన సదస్సుకు విజయరామారావు అధ్యక్షత వహించారు. సదస్సును డాక్టర్ వేల్చాల కొండలరావు నిర్వహించగా, ఆచార్య కొంకా యాదగిరి సమన్వయకర్తగా వ్యవహరించారు. తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద గతం, వర్తమానం, భవిష్యత్‌పై జరిగిన ఈ గోష్టిలో స్టేట్ ఆర్కివ్స్ మాజీ కమిషనర్ హెచ్ రాజేంద్రప్రసాద్, దక్కన్ ఆర్కాయాలజీ పూర్వ సంచాలకుడు డాక్టర్ డి రాజారెడ్డి, చరిత్ర పరిశోధకులు డాక్టర్ జితేంద్రబాబు, ఆచార్య అలోక పరాశర్‌సేన్, ఆచార్య స్వరూప శంకర్, దక్కన్ అకాడమి చైర్మన్ ఎం వేదకుమార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగనభట్ల నరసయ్య, డాక్టర్ పీ అరుణ , ఆచార్య ఆర్ వరలక్ష్మీ, ఆచార్య వెంకటరాజం, ఆచార్య వి కిషన్‌రావు, డాక్టర్ ఎస్ జైకిషన్ తదితరులు మాట్లాడారు. చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన రోజునే భవిష్యత్ అర్ధమవుతుందని అన్నారు. పలు ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో గ్రామాలు ఖాళీ చేయించినపుడు పురావస్తు అవశేషాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు పేర్కొన్నారు. పురావస్తు ఆధారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ఎంత భారమైనా ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవల్సిందేనని వారు చెప్పారు. నేడున్న టెక్నాలజీ ఆనాడు లేకున్నా అప్పటి నిర్మాణాల నైపుణ్యం అబ్బురపరుస్తుందని చెప్పారు. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించినపుడు బౌద్ధ ఆధారాలను పరిరక్షించిన పని నేటి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో చేయలేదని వారు చెప్పారు. కొన్ని గ్రామాల్లో చరిత్ర , ఆధారాలు కాలగర్భంలో కలిసిపోయాయని, కనీసం అక్కడ ఉన్న వారికి కూడా ఆ గ్రామాల ప్రాశస్త్యం తెలియదని వారు చెప్పారు. నాణాలు, శాసనాలు, శిల్పాలు, ఇతర పురావస్తు ఆధారాలు అన్నింటినీ కాపాడుకోవాలని, ఇందుకు ప్రజలను చైతన్య పరచాలని, గ్రామ స్థాయిలోనే ప్రత్యేక కమిటీలను నియమించాలని వారు సూచించారు. ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని పాటించకపోవడంతో తెలంగాణ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతోందని వారు వాపోయారు. చారిత్రక వారసత్వ సంపద కాపాడుకోవాలనే ఆలోచన అందరికీ ఉండాలని అన్నారు. కళ్ల ముందు కనిపించేదే చరిత్ర కాదని, దృశ్యరూపం లేని అనేక కళలు, గీతాలు, వృత్తాంతాలు, జానపద రూపాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయని ఆచార్య అలోక పేర్కొన్నారు. శతాబ్దాల పూర్వం తెలంగాణలో స్ర్తిల జీవన విధానం కూడా చరిత్రలో భాగమేనని, దానిపైనా దృష్టిసారించాలని చెప్పారు.