తెలంగాణ

తెలంగాణ విద్యకు రూ. 2,285.31 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్‌కి బడ్జెట్ ప్రాధమిక స్థాయిలో 1498.83 కోట్లు, మాధ్యమిక స్థాయిలో 761.01 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్‌కు 25.38 కోట్లు కలిపి మొత్తం 2285.31 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రం 479.49 కోట్లు భరించాల్సి ఉంటుంది.
తెలంగాణ సమగ్ర శిక్షా బడ్జెట్‌లో సహిత విద్య విభాగానికి 17.44 కోట్లు ఆమోదించారు. ఇందులో ప్రాధమిక స్థాయిలో 14.90 కోట్లు, మాధ్యమిక స్థాయిలో 2.54 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రాధమిక స్థాయిలో 38,118 మంది , మాధ్యమిక స్థాయిలో 6605 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ప్రాథమిక స్థాయిలో 1184 మంది ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి ఆమోదం లభించగా, ప్రస్తుతం 840 ప్రత్యేక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మాధ్యమిక స్థాయిలో ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. దేశంలో అన్ని రాష్ట్రాలు మాధ్యమిక స్థాయిలో ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం చేయగా, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మాధ్యమిక స్థాయిలో ఎక్కువ శాతం దివ్యాంగులు బడి మానేస్తున్నారు. దివ్యాంగుల విద్యకు సంబంధించి ఉపాధ్యాయ నియామకాలు, దివ్యాంగుల శిక్షణ, గుర్తింపు , ఉపకరణాలు మొదలైనవి మొత్తం భారత పునరావాస సంస్థ మార్గదర్శకాల ప్రకారమే అన్ని రాష్ట్రాలూ పాటిస్తున్నాయి. కానీ ప్రత్యేక ఉపాధ్యాయుల జీత భత్యాలు మాత్రం పునరావాస సంస్థ మార్గదర్శకాలను పక్కన పెట్టాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఎస్‌ఇఎఫ్‌ఐ అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ప్రత్యేక ఉపాధ్యాయుల వేతనాలు భారత పునరావాస సంస్థ సర్క్యులర్ ప్రకారం పంపించాలని అనేక అభ్యర్థనలను పంపించినా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది.
తెలంగాణ రాష్ట్రం కూడా దివ్యాంగుల విద్యలో అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురైంది. వికలాంగుల హక్కుల చట్టం -2016 అమలు, సహిత విద్య మలుకు కొన్ని సూచనలు స్వీకరించిన ప్రభుత్వం వౌనం దాల్చింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను నిర్వచించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది, విద్యాహక్కు చట్టంలో సహిత విద్యకు అనుగుణంగా వికలాంగుల హక్కుల చట్టం 2016లోని విద్యకు సంబంధించిన అన్ని ప్రకరణాలనుచేర్చాలని టీచర్లు సూచిస్తున్నారు. విద్య కోసం భారత పునరావాస చట్టంలో సూచించినట్టు ఉపాధ్యాయుల , విద్యార్థి నిష్పత్తి 1:5 గా మాత్రమేనుండాలని, ఆ నిష్పత్తి ప్రాతిపదికగానే నియామకాలు జరగాలని సూచించింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు, బోధించడానికి భారత పునరావాస కేంఅదంలో నమోదైన ప్రత్యేక ఉపాధ్యాయుడే అర్హుడని కానీ వీరి ప్రస్తావన కూడా లేదని వారు చెబుతున్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం -2016 సహిత విద్య గురించి వివరించిందని, దేశవ్యాప్తంగా సహిత విద్యపై జాతీయ విధానాన్ని రూపొందించాలని వారు అంటున్నారు. వాస్తవానికి నేడు సహిత విద్యను పర్యవేక్షించడానికి ఎలాంటి వ్యవస్థ లేదని, నిష్ణాతులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.