తెలంగాణ

కొలిక్కివస్తే బాబుతో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: మహాకూటమి ఏర్పాటుపై తొలి అడుగులు వేసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు మలి అడుగులకు సిద్ధమవుతున్నాయి. ముందు నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైతే తదుపరి చర్చలు కీలక నేతలతో నిర్వహించనున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు, టీ టీడీపీ నేతలు , సీపీఐ నేతలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడంతో మహాకూటమి ఏర్పాటులో ఎదురయ్యే ప్రతిబంధకాలు తేటతెల్లం అయ్యాయి. ఉమ్మడి మేనిఫెస్టో, మహాకూటమిని ప్రజలు అంగీకరిస్తారా లేదా అనే అంశంతో పాటు కొన్ని కీలక నియోజకవర్గాల్లో పొత్తుల కారణంగా సీట్ల సర్దుబాటు అంశం, తిరుగుబాటు వరకూ దారితీసే సున్నితమైన నియోజకవర్గాలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది.
ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు అన్నీ కలవడం అనివార్యమైన స్థితి అని వారు చెబుతున్నారు. ఇది మొదటి సమావేశం మాత్రమేనని , అన్ని సంఘాలూ, ఉద్యోగ, నిరుద్యోగ , మహిళా సంఘాలతో కూడా కలిసి మాట్లాడాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. కేసీఆర్ పాలనను తప్పుపడుతున్న వారందరినీ కలుపుకుని పోయేందుకు వీలుగా ఉమ్మడి మేనిఫెస్టో అంశాలను కూడా గుర్తిస్తున్నారు.
ప్రధానంగా గృహ నిర్మాణం, వైద్యం, విద్య, ప్రజాసంక్షేమం, మహిళా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏం చేయబోయేది అంతా మరో మారు కూర్చుని చర్చించి ఏకాభిప్రాయానికి రావాలనే భావన ఈ మూడు పార్టీల్లో వ్యక్తమైంది. దాదాపు మూడు పార్టీల నేతల్లో సానుకూలతే వ్యక్తమైందని, మహా కూటమి ఏర్పాటుతోనే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలుగుతామని, ఈ ప్రయోగం ఫలిస్తే ఇరు రాష్ట్రాల్లో అమలు చేయడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ప్రయోగాన్ని ఉపయోగించాలనే భావన వ్యక్తమైంది. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఉమ్మడి ఎన్నికల ప్రచారం అంశాలు కూడా తదుపరి సమావేశాల్లో చర్చకు రానున్నాయి. మరో మారు సమావేశమైన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కూడా కూర్చుని మాట్లాడుకోవాలని, అనంతరం ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిపి, తుదకు అభ్యర్ధుల జాబితాలను ప్రకటించాలనే భావన మహాకూటమిలో వ్యక్తమైంది.