తెలంగాణ

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆర్టీసీ, ప్రభుత్వానిదే బాధ్యత * రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
* లేకుంటే మహాకూటమి సర్కార్ ఇస్తుంది * రవాణా మంత్రి, చైర్మన్, ఎండీలపై కేసులు పెట్టాలి
* కేసీఆర్ తీరుపై అఖిలపక్ష నేతల మండిపాటు
కరీంనగర్, సెప్టెంబర్ 12: ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ఎప్పుడు నీ ధ్యాసంతా ఎన్నికలపైనేనా? దేశ చరిత్రలో, ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి దుర్ఘటన జరిగి 61మంది నిరుపేదలు చనిపోతే, కనీసం బాధితులను పరామర్శించడానికి, క్షతగాత్రులకు ధైర్యం చెప్పడానికి రావా ? అంటూ అపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అఖిలపక్ష నేతలు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బాధితులను కలిసేందుకు సమయం లేదు కానీ ప్రగతి భవన్‌లో పలు పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకునేందుకు మాత్రం సమయం ఉందా అంటూ నిలదీసారు. తెలంగాణ సమాజం పట్ల నీవు వ్యవహరించే తీరు ఇదేనా? తెలంగాణ సమాజం కనె్నర చేస్తే బిడ్డా..నీవు ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతావంటూ హెచ్చరించారు. కొండగట్టు ప్రమాద స్థలాన్ని, బాధితులను పరామర్శించిన అనంతరం కరీంనగర్ చేరుకున్న అఖిలపక్షం నేతలు బుధవారం మధ్యాహ్నం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ మాట్లాడుతూ 61మంది చనిపోవటం, అందులో అందరు నిరుపేదలే కావడం అందరి హృదయాలను కలిచివేసిందని, ఒక్కో గ్రామంలో 10నుంచి 15మంది వరకు చనిపోయారని, కనీసం అక్కడ అంత్యక్రియల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షంలో వారు పడుతున్న ఇబ్బందులు చూస్తే చాలా బాధవేసిందని అన్నారు. కేసీఆర్ రానే లేదని, వచ్చిన ఆయన కొడుకు, కూతురు విహారయాత్రకు వచ్చినట్లు హెలిక్టాపర్‌లో వచ్చి వెళ్లారని, వారు ఇక్కడ ఉండి బాధితులకు అండగా ఉంటూ, వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉండగా, అలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కాసుల కక్కుర్తితోనే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఆర్టీసీ, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రతి ఒక్కరికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో ఏర్పడబోయే మహకూటమి ప్రభుత్వం తొలి సంతకం రూ.50లక్షలు ఇచ్చే పైలుపైనే సంతకం చేస్తుందని అన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా రూ.25వేల సహాయం అందించినట్లు రమణ తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు మాట్లాడుతూ ఎన్నో ప్రమాదాలు చూశానని, కానీ ఇంతమంది చనిపోయిన ఘటన ఎన్నడూ చూడలేదని, ఇది అత్యంత బాధాకరమని అన్నారు. ఇంతటి ఘటన జరిగితే కేసీఆర్ ఇక్కడకు రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. శనివారంపేటలో 19 మంది చనిపోయారని, మృతదేహాలను ఉనుకలో ఉంచారని, కనీసం వారికి మృతదేహాలను భద్రపరిచే ప్రీజ్‌లు ఇచ్చే చర్యలు కూడా చేపట్టలేదని ఆరోపించారు. అటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తరపున ఏలాంటి చర్యలు చేపట్టలేదని, ఫలితంగా వారు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం, ఆర్టీసీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, మంత్రి మహేందర్‌రెడ్డిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇంతమంది చనిపోయినా కేసీఆర్ మనసు చలించలేదంటే, ఆయన పాశవిక వ్యక్తి అంటూ మండిపడ్డారు. తదాస్థు దేవతలుంటారని, అందుకే దేవుడు తొమ్మిది మాసాల ముందే ఆయనను అపద్ధర్మ సీఎంగా చేశారని ఏద్దేవా చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినచోట 25మంది చనిపోతే, ఆసుపత్రి చేరేవరకు 40మంది, ఆసుపత్రుల్లో చేరిన వారికి సరైన వైద్యం అందక 61మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. 39మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారికి కనీస మెరుగైన వైద్యం అందడం లేదని, బాధితులంతా బడుగులు అని నిర్లక్ష్యమా, ఇది ప్రభుత్వ రాక్షసత్వం అని మండిపడ్డారు. గతంలో కొండగట్టులో వాటర్ ట్యాంక్ కూలిన సందర్భంగా అప్పటి సీఎం వైఎస్సార్ వచ్చారని, రామడుగు మండలంలో జరిగిన బస్సు ఘటన సందర్భంగా అప్పటి సీఎం చంద్రబాబు వచ్చారని, కానీ తెలంగాణ వ్యక్తి అయి ఉండి కేసీఆర్ రాకపోవడం నిజంగా బాధాకరమని మండిపడ్డారు.
ఈ ఘటనపై రవాణా మంత్రి, ఎండీ, చైర్మన్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకటేశ్వర్లు, చింతకుంట విజయరమణారావులతోపాటు పలువురు పాల్గొన్నారు.