తెలంగాణ

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్/బిజినేపల్లి, సెప్టెంబర్ 16: సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయ. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. కొండగట్టు ప్రమాదం ఇంకా జనం మరువకముందే ఈ ఘటన జరగడంతో అటు కలెక్టర్, ఇటు పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన ఆరుగురిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆదివారం వీఆర్వో ఉద్యోగానికి నిర్వహిస్తున్న పరీక్ష రాసేందుకు అభ్యర్థులు యాదగిరిగుట్ట నుంచి వనపర్తికి వెళ్తున్న బస్‌లో హైదరాబాద్‌లో ఎక్కారు. వీరందరికీ వనపర్తి జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో సెంటర్ ఉండటంతో దాదాపు 80 మంది వరకు అభ్యర్థులు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. కండక్టర్ కం డ్రైవర్‌గా ఉన్న ఈ బస్సులో కొంతమంది టాప్‌పై కూడా ఎక్కారు. జడ్‌చర్ల-బిజినేపల్లి మధ్యలో ఉన్న వట్టెం సమీపంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలోని మలుపువద్ద బస్సు స్టీరింగ్ కంట్రోల్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పింది. ఈ విషయాన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ రాజు అప్రమత్తంగా ఉండి హ్యాండ్ బ్రేక్ వేసి వేగంగా వస్తున్న బస్సును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనితో ముందు చక్రాలు కుచించుకొని పోయి వెనక్కి పోవడంతో ముందుభాగం భూమిలోకి చొచ్చుకొని పోయింది. దీనితో బస్సుటాప్‌పై ఉన్న కొంతమంది కింద పడటంతో 11 మందికి గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్థులు 108 అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయాలైన రాంచందర్ (బాలానగర్), శివకుమార్ (ఆలేరు), నాగమల్లయ్య (ఆలేరు), ప్రభాకరాచారి, రాజశేఖర్ (మాడ్గుల మండలం నల్లచెరువు), కృష్ణ (వెల్జాల)లకు తీవ్ర గాయాలు కావడంతో వీరికి ప్రథమ చికిత్స చేసి ప్రత్యేక అంబులెన్స్‌లలో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఎక్కువగా మెడవెనుక భాగాన తీవ్ర గాయాలు కావడం, చేతులు, కాళ్లు విరిగిపోయాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు తెలిపారు. ఒకరికి మాత్రం తలపై తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. మిగతా వారిలో భూపాల్ (షాబాద్), రాజు (జడ్‌చర్ల-బాలానగర్), నర్సింహ్మ (గాండీడు), అనిల్ (కొడంగల్), మధుకర్ (వెల్దండ) వీరికి కూడా గాయాలు కాగా, స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికేకాక మరికొందరికి స్వల్పగాయాలు కాగా బిజినేపల్లి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స చేయించుకొని పరీక్ష రాసేందుకు వనపర్తికి వెళ్లారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో వనపర్తికి వెళ్తున్న మిగతా అభ్యర్థులు కూడా వేరే బస్సులో వనపర్తికి వెళ్లారు. ఎఎస్పీ జోగుల చెన్నయ్యతోపాటు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాం సైదాబాబులు ఆస్పత్రిని సందర్శించి తీవ్ర గాయాలకు గురైన వారిని అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.