తెలంగాణ

పొత్తులపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 16: ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ మినహా విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు ఆరంభించడం, మహాకూటమిగా ఏర్పడే అవకాశాలు దాదాపుగా చివరి దశకు చేరుకున్న దరిమిలా ‘పొత్తు’పై ఉత్కంఠ, ఆసక్తి రేపుతోంది. మీకేన్నీ.. మాకేన్నీ అంటూ పార్టీల్లో చర్చలు జరుగుతుండగా, సీట్ల కేటాయింపే అసలు సమస్యగా మారనుంది. పొత్తు కుదిరితే మాత్రం కొందరి ఆశలు గల్లంతుకావడం ఖాయం. కూటమి, పొత్తులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలుండగా, ఈ‘దోస్తీ’పై ఆశావహుల్లో అలజడి రేపుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండగా, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సీన్ రివర్స్ అయిపోయి తెదేపా పూర్తిగా పట్టు కోల్పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13శాసనసభ, 3లోక్‌సభ స్థానాలుండగా, 2014 ఎన్నికల్లో తెరాస దాటికి జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేదు. కాంగ్రెస్ అతికష్టమీద ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి విజయం సాధించారు. మిగితా స్థానాలన్ని అధికార తెరాసనే దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో, రజాకార్ల పాలనను సాగిస్తున్నారంటూ పదేపదే విమర్శించిన విపక్షాలు వచ్చే ఎన్నికల్లో తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా జతకట్టాలని విపక్షాలు ఊవ్విళ్లురుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరాస వెళ్లడంతో బిజేపీ మినహా విపక్షాలు జతకట్టేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో పొత్తుల విషయంపై స్థానిక నేతలకే అప్పగించడం, ఆ పార్టీ అధ్యక్షుడు ఎలగందుల రమణ ఇటీవలే కలిసివచ్చే పార్టీలతో సమాలోచనలు చేయగా, వారంతా అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. అటు కాంగ్రెస్ అధిపతి రాహుల్ కూడా రెండ్రోజులు క్రితం పొత్తులపై టీ కాంగ్రెస్ నేతలకే అప్పగించారు. అయితే, కూటమి ఏర్పాటు దాదాపుగా ఖాయం కాగా, సీట్ల కేటాయింపు అసలు సమస్యగా మారనుంది. ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలనే అంశాలపై చర్చలు చేస్తున్నట్లు తెలుస్తుండగా, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనుండగా, సీటుపై ఆశలు పెట్టుకున్న వారిలో ఎవరీ ఆశలు గల్లంతుకానుందోననే ఉత్కంఠ మాత్రం ఆయా పార్టీల శ్రేణుల్లో నెలకొంది. హుజురాబాద్ స్థానాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ స్థానంపై కనే్నసిన కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానంతోపాటు మరోటి టీడీపీకి, ఒకట్రెండు టీజెఎస్‌కు, ఒకటి సీపీఐకి, మిగితావి కాంగ్రెస్‌కు కేటాయించవ్చన్న ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా తన వెంట వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉండగా, వీరు ఆశిస్తున్న స్థానాల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఆశిస్తున్నారు. ఏదిఏమైనా విపక్షాల ‘పొత్తు’పై అందరిలో ఆసక్తి, ఉత్కంఠ రేపుతుండగా, పొత్తుతో ఎవరి సీటు గల్లంతుకానుందోనన్న టెన్షన్ ఆయా పార్టీల నేతల్లో నెలకొంది.