తెలంగాణ

వివాహితులకు వీఆర్వో ‘పరీక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్, సెప్టెంబర్ 16: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ సెంటర్‌లో జరిగిన వీఆర్వో పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులకు చేదు అనుభం ఎదురైంది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా సెంటర్ ఇన్‌చార్జిలు మహిళా అభ్యర్థులు పుస్తె, మట్టెలు తీస్తేనే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని షరతు విధించడం సంచలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని లిటిల్‌ప్లవర్ పాఠశాలలో ఆదివారం జరిగిన వీఆర్వో పరీక్షల నిమిత్తం హాజరైన మహిళ అభ్యర్థులు విధిగా తమ తాళిబొట్టు, మెట్టెలు తీసివేయాలని పాఠశాల కరస్పాండెంట్ సిఎల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆర్‌కె నారాయణలు ఆంక్షలు పెట్టారు. దాంతో చేసేది లేక పది మంది వరకు గృహిణులు తమకు ఇష్టం లేకపోయినా తాళిబొట్లను, మెట్టెలను అతి బలవంతంగా తీసివేసి తమ బంధువులకు ఇచ్చి పరీక్ష సెంటర్‌లోకి అడుగుపెట్టారు. దాంతో బయట ఉన్న మహిళల భర్తలు, బంధువులు ఇదేక్కడి పరీక్ష మహిళలను అవమానించే విధంగా అధికారులు ప్రవర్తించడం సిగ్గుచేటని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. విషయం తెలిసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపగారి రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. పాఠశాల యాజమాన్యం మహిళల పట్ల చిన్న చూపు చూపి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వాదనలకు దిగారు. దాంతో పరీక్షల ఇన్‌చార్జి చిలిపిచెడ్ తహశీల్దార్ మనోహర్ చక్రవర్తి, సీఐ సైదులు, ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్‌లు అక్కడి చేరుకొని బాధితులకు సర్ది చెప్పారు. ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అవగాహన లోపం వల్ల చీఫ్ సూపరింటెండెంట్ ఇలాంటి వివాదాలకు తెరతీశాడని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.