తెలంగాణ

సత్వర తీర్పుకోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 20: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ హత్య విషయంలో పోలీసలు మరింత జాగ్రత్తగా వ్యవహరించి చార్జీషీటు రూపొందించాలని హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలో ప్రణయ్‌కుమార్ ఇంటికి వచ్చి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించి సంతాపం, సానుభూతిని ప్రకటించారు. వారితో సుమారు గంట సేపు మాట్లాడారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదిక, సాక్ష్యాధారాలను పకడ్బందీగా రూపొందించి కోర్టులో నివేదించాలని పోలీసులకు సలహా ఇచ్చారు. ఇప్పటి వరకు వెంటనే నిందితులను అరెస్టు చేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లో తీర్పు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రేమ పెళ్లిల రక్షణ, భద్రత (ప్రణయ) చట్టం తీసుకురావాలన్నారు. కృష్ణుడు, వివేకానంద స్వామి అనేక మహానుభావులు ప్రేమ, కులాంతర వివాహాలు చేసుకున్న వారేనన్నారు. నేడు ప్రజలు గుర్తించాలన్నారు. ప్రణయకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ అదనపు డీజీపీ
మిర్యాలగూడ పట్టణంలో ప్రేమ పెళ్లిచేసుకుని హత్యకు గురైన పి.ప్రణయ్‌కుమార్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ పివి.సునిల్‌కుమార్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ప్రణయ్‌కుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు. తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తమ్ముడు అజయ్‌కుమార్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన వెంట స్థానిక డీఎస్పీ పి.శ్రీనివాస్ ఉన్నారు.