తెలంగాణ

ప్రణయ్ హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 20: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ హత్యోదంతం మరచిపోక ముందే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రణయ్ ఇంటిని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తమ్ముడు అజయ్‌కుమార్‌లను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రణయ్‌ను హతమార్చడం దారుణమని, హేయమైన చర్యగా పేర్కొన్నారు. సంఘటన తెలుసుకున్న వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ప్రణయ్‌ది పరువు హత్య కాదని, పరువు తక్కువ హత్య అని పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడ్తామన్నారు. కుల అహంకారంతో ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావు లాంటి వ్యక్తులను సంఘ బహిష్కరణ చేయాలన్నారు. ప్రణయ్ భార్య అమృతకు 8.25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి అందించాల్సి ఉండగా నేడు 4,12,500 రూపాయలకు చెక్కును అందజేశామని తెలిపారు. రెండో విడత డబ్బు చార్జీషీట్ దాఖలైన అనంతరం అందజేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ నుండి వ్యవసాయ భూమి, రెండు పడకల గది ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ గౌరవ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ మిర్యాలగూడ, తుంగతుర్తి తాజా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్, ఆర్డీఓ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.