తెలంగాణ

27 నుంచి శాసనమండలి సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు గవర్నర్ పేరిట బులిటిన్ విడుదల చేసారు. శాసనసభ రద్దు అయినా శాసనమండలి యధాతధంగా కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆరు నెలల లోపు శాసన సభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. శాసనసభ మనుగడలో లేకపోవడం వల్ల శాసనమండలి సమావేశాలు కొనసాగనున్నాయి. శాసనసభ నియామావళి ప్రకారం శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఇవీ మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 27న ఉదయం 11 గంటలకు శాసనమండలి సమావేశాలు కౌన్సిల్ హాల్‌లో ప్రారంభం కానున్నాయి.