తెలంగాణ

ఎడతెరిపి లేని వాన - ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం వేకువఝాము నుంచి రాత్రి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరు నుంచి ఓ మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సామాన్య జనజీవనం కొంతమేర స్తంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమాన్‌పూర్, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, ధర్మపురి, వేములవాడ తదితర మండలాల్లో భారీగా వర్షం కురువగా, కరీంనగర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, చందుర్తి, సిరిసిల్ల, ధర్మారం, సుల్తానాబాద్, పెగడపల్లి, ముస్తాబాద్, తిమ్మాపూర్, రాయికల్, మెట్‌పల్లి, ఇల్లంతకుంట, గోదావరిఖని, కేశవపట్నం, జగిత్యాల, సైదాపూర్, జూలపల్లి, కోరుట్ల, జమ్మికుంట, గొల్లపల్లి, పెద్దపల్లి, మానకొండూర్, వెల్గటూర్ మండలాల్లో చిరు నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో తోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికే నిండిన చెరువులు ఎడతెరిపి లేని వానతో మత్తడులు దూకాయి. అటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రామగుండం రీజియన్ పరిధిలోని నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఓసీపీ-1లో 15వేల టన్నులు, ఓసీపీ-2లో 6వేలు, ఓసీపీ-3లో 15వేలు, ఓసీపీ-4లో 12వేల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, సుమారు రూ.1.60కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఓసీపీల్లో వరద నీరు నిల్వ ఉండకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. భారీ మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తోడేసే చర్యలను చేపట్టారు. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ సంకేతాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.