తెలంగాణ

కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, సెప్టెంబర్ 21: తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు వారి అభీష్టం మేరకు దేవరకొండ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై కొట్టి ఈ నెల 26న కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ ప్రకటించారు. శుక్రవారం చింతపల్లిలో కార్యకర్తలు, మద్దతునిచ్చే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అనుచరులతో సమావేశమైన బాలునాయక్ మాట్లాడుతూ తనను టీఆర్‌ఎస్‌లో అణుగదొక్కేందుకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందుకే తనకు దేవరకొండ నుండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఎంతో ప్రోత్సహించిందని, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌లో తాను ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యానన్నారు. జిల్లా అభివృద్ధికి నిధుల సాధనకు తాను అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన తనకు రాజకీయంగా చివరకు అన్యాయమేజరిగిందన్నారు. మళ్లీ తనను, గిరిజన జాతిని ఆదరించే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఈ నెల 26న తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రకటించారు.