తెలంగాణ

ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 21 : సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకగ్రీవ తీర్మాన సభలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగభరితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి హరీష్‌రావుకు గ్రామస్థులు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికారు. జోరువానను సైతం లెక్కచేయకుండా గ్రామస్థులు, మహిళలు వృద్ధులు, యువత, పిల్లలు గ్రామ పొలిమెరలకు చేరుకున్నారు. మంత్రి హరీష్‌రావు గ్రామానికి రాగానే ఘనస్వాగతం పలికి, ప్రత్యేకంగా ముస్తాబుచేసిన అశ్వరథంపై ఎక్కించి గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. గొల్లకుర్మల డోళ్లు, డప్పులు, మహిళల బతుకమ్మ, బోనాలు, యువత నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా, ఉల్లాసాంగా భారీ ఊరేగింపుగా బహిరంగ సభ వేదికఫంక్షన్ హాల్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అన్ని కుల సంఘాల ప్రతినిధులు, మహిళా గ్రూపు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పత్రాన్ని హరీష్‌రావుకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు గ్రామస్థులు చూపిన ఆదరాభిమానాలు, అప్యాయతలను చూసి ఉద్వేగానికి లోనైనారు. ఆనంతరం మాట్లాడుతూ మీరు చూపిస్తున్న ప్రేమ, అనురాగాలను చూసి ఎంతో సంతోషిస్తున్నానని.. మీరు చూపించిన ప్రేమ, అనురాగాలను చూసి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఎప్పుడు వచ్చినా మీరు ఇదే ప్రేమ, అనురాగాన్ని నా పట్ల చూపారని, గత ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం తీర్మానం చేశారన్నారు. ఇంతకంటే ఒక నాయకుడికి ఏం కావాలని, ఈ తృప్తి, గౌరవం.. ఈ జన్మకు ఇది చాలన్నారు. నాకు ఊపిరి ఉన్నంతవరకు రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా నాకు శక్తి ఉన్నంత వరకు మీకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
ఇబ్రహీంపూర్ తెలంగాణ గ్రామాలకు దిక్సూచి
గ్రామంలో అంతా ఐక్యంగా, సమష్టిగా కృషిచేయటం వల్లనే ఇబ్రహీంపూర్ గ్రామం రాష్ట్రంలోని మిగత గ్రామాలకు దిక్సూచిగా మారిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గ్రామంలో ఒకే రోజు 2లక్షల మొక్కలు నాటి గ్రామాన్ని ఆకుపచ్చగా మార్చారని, వందశాతం ఇంకుడు గుంతలతో ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో 10 అవార్డులు సాధించటం విశేషమన్నారు. వేల మంది సర్పంచ్‌లు ఈ గ్రామాన్ని సందర్శించి చూసి నేర్చుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పారు. ఆనంతరం మంత్రి హరీష్‌రావు గ్రామస్థులు నాగలి ఇచ్చి సన్మానం చేసి, ఏకగ్రీవ పత్రాలను సంఘాల వారీగా అందచేసి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.