తెలంగాణ

ఆ నలుగురి కోసం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకులను చూసి చలించి పోయిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారనీ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురి కోసం కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్, భిక్కనూరు, బస్వాపూర్ గ్రామాలకు చెందిన పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు రావడంతో షబ్బీర్‌అలీ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆంకాంక్షను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని గర్జించిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను దుంగలో తొక్కిందన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూంలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి జాడ లేదని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం అది ఇవ్వలేదని, ఇంటికొక్క ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వం ఆది కూడా ఇవ్వలేని దౌర్భాగ్యస్థితికి దిగజారిందని విమర్శించారు. ఇంటింటికీ నల్లానీళ్లు అందిస్తానని, మిషన్‌భగీరథ నీరు ఇంటింటికీ రాకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్‌ఎస్ రాదని, చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం వెళ్తారని ఎద్దేవాచేశారు. మిషన్ భగీరథ నీరు ఎక్కడ వస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంతవరకు కూడా కొన్ని చోట్ల పైపులైన్‌లు కూడా వేయని దుస్థితిలో ఉందని, వేసిన పైప్‌లైన్‌లు ఎక్కడిక్కడ పగిలిపోతూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నా విషయాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. కేవలం కమీషన్‌ల కోసం పనులు చేపడుతూ ప్రజాధానాన్ని లూటీ చేస్తుందన్నారు. ఎంతో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే అవసరం ఈ ఎన్నికల్లో వచ్చిందన్నారు. ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు గడువున్నప్పటికి ముందస్తు ఎన్నికలకుపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యాబట్టారు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పనితీరును ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో షబ్బీర్‌అలీ గెలుపు కోసం గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బీజేపీ మండలాధ్యక్షుడు డప్పు రవి ఆధ్వర్యంలో 50 మంది, రజక సంఘం 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ కండువాలు వారి మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, డీసీసీబీ కార్యదర్శి నల్లవెళ్ళి అశోక్ పాల్గొన్నారు.