తెలంగాణ

టీఆర్‌ఎస్ పాత్ర లేకపోతే కేసీఆర్ ఇంటికెందుకు వచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో టీఆర్‌ఎస్ పాత్ర లేకుంటే గులాంనబీ ఆజాద్ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటికి ఎందుకువచ్చారని ఎంపీ బి వినోద్‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఆజాద్ వ్యాఖ్యలకు తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేనప్పుడు ఆజాద్ కేసీఆర్ ఇంటి మెట్లు ఎక్కలేదా? అని నిలదీసారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఏమి చేసిందో తెలుసు కాబట్టే 2014 ఎన్నికల్లో ప్రజలు సరైన సమాధానం చెప్పారన్నారు. ఫజల్ అలీ కమిషన్ నివేదికను పట్టించుకోకుండా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లవ కలిపింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మోసం చేయడం వల్లనే 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని ఆజాద్ మరిచిపోయారా? అని గుర్తు చేసారు. కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించింది టీఆర్‌ఎస్ కాదా? అని వినోద్ నిలదీసారు. తెలంగాణపై ప్రకటన చేసి ఆంధ్ర నేతలకు లొంగి అప్పటి యుపీఏ ప్రభుత్వం ఆ ప్రకటనను వెనక్కి తీసుకుందన్నారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటున్నారు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసారా? అని మండిపడ్డారు. అయితే కొందరు ఎంపీలు మాత్రం తెలంగాణ కోసం పోరాడిన మాట వాస్తవమన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఉద్యమం చేసారా? బయటికి వచ్చి మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తాము 32 పార్టీలను ఒప్పించడం వల్లనే బిల్లు పాసు అయిందని వినోద్‌కుమార్ గుర్తు చేసారు. టీఆర్‌ఎస్ పాత్ర లేకుండానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని అజాద్‌కు వినోద్‌కుమార్ సవాల్ విసిరారు.