రాష్ట్రీయం

రాఫెల్ స్కాం నిజమని స్పష్టమైనందున జైట్లీ, నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందనేది ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలతో తేలిపోయినందున, ఇంత కాలం దేశ ప్రజలకు అబద్దాలు చెప్పిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ వత్తిడితోనే అంగీకరించాల్సి వచ్చిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఏమని సమాధానం చెబుతారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇంకా తమ పార్టీ సీనియర్ నాయకులంతా గత కొన్ని రోజులుగా రాఫెల్ కుంభకోణం గురించి చెబుతున్నదంతా ఇప్పుడు నిజమేనని స్పష్టమైందన్నారు. దేశానికి సంబంధించిన ఒప్పందాన్ని మరో దేశ ప్రభుత్వం ఖండించడం దేశ చరిత్రలోనే మొదటి సారి అని ఆయన తెలిపారు. అప్పటి రక్షణ శాఖ మంత్రి పారికర్‌కు తెలియకుండా రాఫెల్ ఒప్పందం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పారికర్ కూడా చెప్పారని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా రాఫెల్ ఒప్పందం కదుర్చుకున్న సమయంలో సంబంధిత శాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీ వెంట లేరు కానీ అనిల్ అంబానీ మాత్రం ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి 41 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చేలా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. ఆయుధాల కొనుగోలు విషయంలో రక్షణ శాఖ నిబంధనలు పాటించలేదని ఆయన విమర్శించారు. మాట్లాడితే అనవసరంగా బయటపడతామన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌కు కాకుండా అంబానికి ఎలా ఇచ్చారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నదే తమ ప్రధాన ప్రశ్నలని ఆయన తెలిపారు. రాఫెల్ కుంభకోణం జరిగిందన్న విషయం ప్రజలకు అర్థమైందనీ, నిజాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ఏవైనా రక్షణ ఒప్పందాలు చేసుకుంటే హెచ్‌ఏఎల్‌కు ప్రాధాన్యం ఇచ్చాయని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు.