తెలంగాణ

విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: విజయమే లక్ష్యంగా బిజెపి ఇంటింటి ప్రచారం చేస్తుందని బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటింటికీ బీజేపీ కార్యకర్తలు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, దేశంలో నరేంద్రమోదీ పాలన గురించి వివరిస్తారని అన్నారు. బీజేపీ పార్టీ యంత్రాంగాన్ని ముందస్తు ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామని అన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తి చేశామని చెప్పారు. ఓటర్లను స్వయంగా కలవడం, టీఆర్‌ఎస్ పాలన కుటుంబ పాలన, ముఖ్యమంత్రి నియంతృత్వ విధానాలను వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏ విధంగా అధోగతిపాల్చేసిందో కూడా చెబుతామని అన్నారు. అఖిల భారత అధ్యక్షుడు అమిత్ షా మహబూబ్‌నగర్ సభ తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైందని అన్నారు. ఎన్నికలకు ముందు రెండో సభ అక్టోబర్ మొదటివారంలో కరీంనగర్‌లో జరగబోతోందని చెప్పారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. స్వయంగా ఈ సభ విజయవంతం చేసేందుకు దత్తాత్రేయ, మురళీధరరావు, డాక్టర్ లక్ష్మణ్ తానూ కలిసి రేపటి నుండే సన్నాహాలు ప్రారంభిస్తామని అన్నారు. ఈ సభ తర్వాత జాతీయ నాయకులు కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారని, జనరల్ సెక్రటరీ సంతోష్‌జీ ఎన్నికల పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో, ప్రభుత్వంపై చార్జిషీట్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు బీజేపీ సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఓటర్ల లిస్టును పరిశీలించడం, ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే అందరి ఓట్లు ఓటర్ల జాబితాలో వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరస్పర వైరుధ్యాలున్న పార్టీలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయని, కూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని చూస్తోందని, కాని ప్రారంభానికి ముందే ఆపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆనాటి కాంగ్రెస్ నేతలు టీడీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ, బహిరంగ సభల్లోనూ ఏం మాట్లాడారో ఆ వీడియోలు ఒక సారి పరిశీలించాలని, అదే విధంగా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీపై ఏం మాట్లాడారో కూడా చూస్తే వారి చిత్తశుద్ధి ఏమిటో అర్ధమవుతుందని అన్నారు. రెండు పార్టీల రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు.
ప్రజల చైతన్యానికే ఉత్సవాలు
వినాయక ఉత్సవాలు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, సమాజాన్ని ఒకే తాటిపైకి తేవడానికి ఎంతో ఉపయోగపడ్డాయని బీజేపీ ప్రధానకార్యదర్శి చింతాసాంబమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు డ్రామాల పార్టీ
తెలుగు దేశం పార్టీ తెలుగు డ్రామాల పార్టీలా మారిందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థనరెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని అన్నారు. రాయలసీమకు కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పనులకు ఖర్చు చేసిందని, రాయలసీమను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక మంత్రి ఉన్నారా లేదా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు.