తెలంగాణ

ఏ లక్ష్యంతో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తెచ్చారు?: టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఏ లక్ష్యంతో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందో చెప్పాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్ ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం ఆదరబాదరాగా ఆ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం వెనుక ఓట్ల వేట లేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి దానిని సెలక్ట్ కమిటీకి పంపించారని, సె లక్ట్ కమిటీ నుండి రిపోర్టు రాకముందే ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ముస్లింల్లో చీలిక ఎందుకు తెస్తున్నారని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని, దేశంలో 15 శాతం ముస్లింల జనాభా ఉందని, ఎన్నికల ముందు ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్ తెచ్చి ఏం సాధించాలనుకుంటున్నారని అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ముస్లిం యువకులను ఇబ్బంది పెట్టి జైలులో పెట్టాలనుకుంటున్నారా?కుట్రలకు ముస్లింలు బలైపోవాలా అని ప్రశ్నించారు. బీజేపీకి వంత పాడుతున్న కేసీఆర్ , టీఆర్‌ఎస్ పార్టీ దీనిపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాసే ఎంఐఎంను కూడా ఇదే ప్రశ్న వేస్తున్నామని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం అధినేత బెట్‌కట్టారని, కేసీఆర్‌కు ఎందుకు ఓట్లు వేయాలో ఎంఐఎం నేతలు చెప్పాలని అన్నారు.