తెలంగాణ

మిగిలిపోతున్న సీట్లకు చిట్కా .. ఇంజనీరింగ్ కాలేజీల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రతి ఏటా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు మిగిలిపోవడం, కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు జరగడంతో కాలేజీల మూసివేత, విద్యార్థుల ఆందోళన, వారిని వేరే కాలేజీల్లో సర్దుబాటు చేయడం వంటి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా , కాలేజీలను పూర్తిగా వేసే బదులు ఇక మీదట మిగిలిన కాలేజీల్లో వాటిని విలీనం చేసే ఆలోచనను ఎఐసీటీఈ పరిశీలిస్తోంది. మరో పక్క పలు కాలేజీలు కొత్త కాలేజీలు వద్దని కోరుతున్నా, సాంకేతికంగా కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినపుడు, వారు వౌలిక సదుపాయాలను కల్పించినపుడు ఆ దరఖాస్తులను నిర్ధ్వంద్వంగా తిరస్కరించే వీలు లేకపోవడంతో వాటిని ఏఐసీటీఈ అనుమతిస్తోంది, అలా అనుమతి ఇచ్చిన ప్రతిసారీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదాలు జరుగుతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాలు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు, కొత్త డిప్లొమో కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని ముందుగానే కోరుతున్నాయి. కానీ కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వ విజ్ఞప్తిని పక్కన పెట్టి కొత్త కాలేజీలకు అన్ని సౌకర్యాలను కల్పించి దరఖాస్తు చేస్తున్నాయి, దాంతో ఏఐసీటీఈ కొత్త కాలేజీలకు అనుమతించక తప్పని పరిస్థితి నెలకొంది, ఇంతటి ఘర్షణ వాతావరణంలోనే కాలేజీలను ప్రారంభించినా, అవి ఎంతకాలం నడవక మూత పడే పరిస్థితికి వస్తున్నాయి. తెలంగాణలో దాదాపు వంద కాలేజీల్లో 50లోపు అడ్మిషన్లు జరిగాయి. పది కాలేజీల్లో సింగిల్ డిజిట్‌లోనే అడ్మిషన్లు జరిగాయి. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో నెలకొంది. రానున్న నాలుగైదేళ్లు కొత్త కాలేజీలను మంజూరు చేయవద్దని ఈ రాష్ట్రాలు కోరుతున్నాయి. 2014-15లో దేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీలో 39.61 లక్షల సీట్లు ఉండగా, అందులో 5.72 లక్షల సీట్లకు గత ఐదేళ్లలో కోత పడింది. దాంతో 2018-19 నాటికి సీట్ల సంఖ్య 33.89 లక్షలకు తగ్గింది. తెలంగాణలోనూ అనేక కాలేజీలు సివిల్, ఐటీ బ్రాంచిలలో సీట్లను సరెండర్ చేశాయి. దీంతో ఫ్యాకల్టీని కొనసాగించలేక, వారికి వేతనాలు ఇచ్చి కొనసాగించ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని కాలేజీలు మూత వేసి వాటి స్థానంలో పాఠశాలలు నిర్వహిస్తుండగా, రానున్న రోజుల్లో ఈ దురవస్థను అధిగమించేందుకు మంచి సదుపాయాలుండి, విద్యార్థులు లేకపోతే ఆ కాలేజీల్లో సిబ్బందిని, వౌలిక సదుపాయాలను మరో కాలేజీలో విలీనం చేసి నడపడం ద్వారా సదుపాయాల కొరత, సిబ్బంది కొరత తీర్చవచ్చని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుండి ఈ ప్రయోగాన్ని అమలులోకి తీసుకున్నారానున్నట్టు తెలిసింది.