తెలంగాణ

ఓట్ల కోసం డ్రామాలాడను.. ప్రజా సంక్షేమానికే పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 22: ఓట్ల కోసం వెంపర్లడుతూ డ్రామాలు చేసే నాయకుడ్ని కాదని.. ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషిచేసే నైజం తనదంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణవల్ల నిర్వాసితులుగా మారే వ్యాపారులు, బాధితులు శనివారం స్ధానిక క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. నిర్వాసితుల అభిప్రాయాలను, వారి ఇబ్బందులను సావధానంగా విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాకేంద్రంగా మారిన పట్టణంలో రోజురోజుకు ట్రాఫీక్ అధికమవుతోందని, పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు రోడ్ల విస్తరణ చేయక తప్పదని స్పష్టం చేశారు. విస్తరణకు వ్యాపారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ల విస్తరణ వల్ల దుకాణాలు కొల్పోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హమీనిచ్చారు. పూర్తిస్ధాయిలో దుకాణాలు కొల్పోతున్న వారికి నూతనంగా నిర్మిస్తున్న మోడల్ మార్కెట్‌లో దుకాణాలను కేటాయించడంతో పాటు తగిన విధంగా పరిహారం చెల్లించి ఆదుకుంటామని, ఏ ఒక్క దుకాణదారుడు విస్తరణ వల్ల ఉపాధి కొల్పోకుండా చూసే బాధ్యత తనదని భరోసానిచ్చారు. కొంతమంది ప్రయోజనాల కోసం లక్షలాదిమంది ప్రజలను ఇబ్బందులు పట్టలేమని వ్యాపారులు సహకరిస్తే జిల్లాకేంద్రాన్ని మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాశ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.