తెలంగాణ

టీఆర్‌ఎస్ హయాంలో దళితులకు రక్షణ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, సెప్టెంబర్ 22: దళితలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండాపోయిందని, అందుకు నిదర్శనం ప్రణయ్ హత్యేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇటీవల మిర్యాలగూడలో దళితుడైన ప్రణయ్ హత్యకు నిరసనగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫూలాంగ్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, దళితులు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని, అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిల తల్లిదండ్రులు మిర్యాలగూడ నుండి హైదరాబాద్ వరకు హత్యలకు, దాడులకు పాల్పడుతున్నారని, అయినా కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇటీవల మిర్యాలగూడలో దళిత యువకుడైన ప్రణయ్‌ను, అగ్రవర్ణానికి చెందిన అమృత కులాంతర వివాహం చేసుకుంటే, ఆమె తండ్రి మారుతిరావు పగబట్టి ప్రణయ్‌ని కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. మారుతిరావు నుండి తమకు ప్రాణహాని ఉందని ప్రణయ్, అమృతలు ఐజీ నుండి డీజీపీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయిందన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వెనుక కుట్రదారులైన మారుతిరావు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉండటమేనని అన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుట్రదారులైన మారుతిరావు నెల రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌లో చేరి, ఆయన అండదండలతో దళితుడైన ప్రణయ్‌ను హత్య చేయించడం జరిగిందన్నారు. ప్రణయ్ హత్యను ఆపద్ధర్మ ముఖ్మమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ ఖండించకపోవడం శోచనీయమన్నారు. గడిచిన వారం రోజులుగా ప్రణయ్-అమృత, సందీప్-మాధవి చుట్టే వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా దళితులపై హత్యలు, దాడులను ఆపి, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి 10లక్షల రూపాయలు, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న దళితులు వివాహం చేసుకుంటే నూతన చట్టంతో పాటు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే దళితులకు రక్షణ కావాలంటే ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, బాలాజీతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.